ప్రకాశం జిల్లా టీడీపీ పొలిటికల్ పిక్చర్..

 Posted May 1, 2017 at 13:35

prakasam district political leaders political picture
ప్రకాశం జిల్లా రాజకీయాల్ని లోతుగా పరిశీలించాలంటే ముందుగా ఓ విషయాన్ని గమనించాలి.అదే 2014 ఎన్నికలు..తదనంతర పరిణామాలు.నాటి ఎన్నికల్లో కోస్తాలో టీడీపీ ప్రభంజనానికి స్పీడ్ బ్రేకర్ పడడం ఇక్కడ నుంచే మొదలైంది.మొత్తం 12 నియోజకవర్గాలకు గాను వైసీపీ 6 చోట్ల,టీడీపీ 5 చోట్ల,ఇండిపెండెంట్ (ఆమంచి కృష్ణ మోహన్ ,చీరాల) ఒక్క చోట విజయం సాధించారు.జిల్లాలో ఒక కుల ప్రాబల్యం బలంగా వున్నచోట వైసీపీ ,ఇంకో కుల బలం వున్న చోట,మరోకులం అండతో టీడీపీ 5 చోట్ల గెలుపు సాధించింది.అయితే ఎన్నికల తరువాత పరిణామాలతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేసారు.ఓటమి పాలైన ఓ వైసీపీ అభ్యర్థి కూడా దేశం తీర్ధం పుచ్చుకున్నారు.నిజానికి ఇలా జరిగితే పార్టీ బలం పుంజుకోవాలి.వైసీపీ కి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగలడంతో ఆ పార్టీ వాయిస్ వినిపించే నాధుడే లేకుండా పోవాలి.

కానీ ఇంతకు ముందు ఎన్నికలతో పోల్చుకుంటేటీడీపీ పుంజుకుంది లేకపోగా పార్టీలో అయోమయం పెరిగింది.అందరూ ఒకే పార్టీ.అయినా రెండు గ్రూపులు.వేర్వేరు రాజకీయ వ్యూహాలు.ఈ పరిస్థితి ముందే ఊహించినప్పటికీ నిలవరించగలమని టీడీపీ హైకమాండ్ భావించింది.కానీ దాని అమలు అంత తేలిగ్గాదని ఇప్పటికే అర్ధమైంది. ఈ విషయంలో టీడీపీ అధినేత ఎంతో చొరవ,ఇంకెంతో త్యాగంతో జిల్లాకి చెందిన ఇద్దరు అసంతృప్తులకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.ఇంతకుముందు పదవి లేక,ఓటమితో దుగ్ధతో రాజకీయం చేసిన వాళ్ళు ఇప్పుడు పదవి తెచ్చిన ఊపుతో అదే అసంతృప్తి రాజకీయం చేస్తున్నారు.చీరాలలో పోతుల సునీత కి స్థానికంగా బలం తక్కువ కావడంతో కొంత పర్లేదు గానీ అద్దంకి విషయంలో రెండు వర్గాల మధ్య పోరు ఏ స్థాయిలో జరుగుతుందో చూడాలంటే ఇద్దరు నేతలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఫైట్ చూస్తే చాలు.రెండు చోట్ల ఎలాగైనా ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి పార్టీ బలోపేతం కోసం ఈ పని చేశామని ఒక్కరైనా చెప్పే పరిస్థితి లేదు.

kondapi constituency jupudi prabhakar vs bala veeranjaneya swamy and damacharla janardhanపదవులు వచ్చిన చోట పరిస్థితే అలా ఉంటే పదవులు రాని చోట ఇక ఏ స్థాయిలో ఎలా ఉంటుందో చూద్దాం.కొండెపి నియోజకవర్గంలో జూపూడి,బాలవీరాంజనేయ స్వామి మధ్య ఓ రోడ్ కాంట్రాక్టు వ్యవహారంలో రేగిన చిచ్చు ఇంకా ఆరలేదు.అంతకన్నా చిత్రం ఏమిటంటే ఒకప్పుడు బాలవీరాంజనేయ స్వామికి టికెట్ ఇచ్చి గెలిపించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు,ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ఇప్పుడు జూపూడికి అండగా కొండెపి రాజకీయాల్లో కలగజేసుకోవడంతో పరిస్థితి అంతకంతకీ దిగజారుతోంది.కందుకూరు,గిద్దలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి .ఇద్దరు నాయకులు పైకి టీడీపీలోనే ఉన్నట్టు చెప్పుకుంటున్నా వైసీపీ కన్నా సొంత పార్టీ లోని రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ తీయడానికే శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు.ఈ క్రమంలో వాళ్ళు చేసే పనులు చెప్పాలంటే చిన్న పిల్లల చేష్టల్ని తలపిస్తున్నాయి.

mla yeluri sambasiva rao,markapuram incharge kandula narayana reddyఈ అంతర్గత విభేదాలు నిజానికి ప్రతిపక్షంతో పోరాటం కన్నా ఎక్కువగా వున్నాయి.ఇది నిజం. పైగా ఈ గొడవేమీ లేకపోయినా మార్కాపురం ఇన్ ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి పార్టీ క్యాడర్ ని సమన్వయము చేసుకోలేకపోతున్నారు.ఇక చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా సునీత వర్గం అన్న డౌట్ తో పక్కా టీడీపీ కార్యకర్తల్ని కూడా పక్కకి చేర్చుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇక పర్చూరు నియోజకవర్గంలో పార్టీ కి వైసీపీ ఇంచార్జి బలహీనత కారణం గా టీడీపీ అనుకూల వాతావరణం కనిపిస్తున్నా దాన్ని ఏకపక్షం చేయడంలో ఎమ్మెల్యే సాంబశివరావు విఫలం అవుతున్నారు.ఆయనే స్వయంగా టీడీపీ నేతల్ని విభజించి పాలించే ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.దీంతో నియోజకవర్గంలో పార్టీ సీనియర్స్ ఆయన మీద తీవ్రాతితీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

yerragondapalem mla david rajuఈ నేతలంతా యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజుని ఆదర్శంగా తీసుకుని పని చేయాలి.ఆయన 19 వేలకి పైగా మెజారిటీతో వైసీపీ తరపున గెలిచి టీడీపీ లో చేరినా పార్టీ లో అన్నిస్థాయుల నేతల్ని కలుపుకెళ్లి పని చేస్తున్నారు.

SHARE