భారతీ రాజా కన్నా ప్రకాష్ రాజ్ బెటర్..

prakash raj better than bharathi raj
కావేరి జలాల వివాదంలో రగులుతున్న కర్ణాటక,తమిళనాడుల్ని చల్లార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.కొందరు సెలెబ్రెటీలు ఈ అంశంపై స్పందించారు.ప్రముఖ దర్శకుడు భారతీరాజా అందులో ఒకరు.ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.సొంత రాష్ట్రం తో పాటు దేశంలో తమిళుల ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.ఇటీవల ఒకటిన్నర లక్షలమంది తమిళుల్ని చంపారంటూ కూడా భారతీ రాజా ఏ ఆధారంలేని మాటలు ఆ ప్రకటనలో రాశారు. ఎర్రచందనం స్మగ్గర్ల విషయాన్ని చెట్లు కొట్టినందుకు 20 మంది తమిళుల్ని చంపారని మార్చేశారు.మొత్తానికి కావేరి అంశంలో రగిలిన వేడిని తమిళుల్లో ఇంకాస్త రెచ్చగొట్టేందుకు భారతీరాజా ప్రయత్నించారు.వెండితెరపై దృశ్యకావ్యాల్ని ఆవిష్కరించిన అలాంటి మహానుభావుడు ఉద్రిక్తతల వేళ ఇంత చౌకబారు ప్రకటన చేసి ఓట్ల వేట్లకెళ్లే రాజకీయనాయకుల మాదిరిగా వ్యవహరిస్తారని ఏ మాత్రం ఊహించలేదు.వయసు ,అనుభవం రీత్యాకూడా తన స్థాయికి ఏ మాత్రం తగని ప్రకటన ఆయన్నుంచి వచ్చిందనే చెప్పాలి.

మరో వైపు ప్రకాష్ రాజ్ మాత్రం అలాంటి భావనలకు దూరంగా తన సందేశం వినిపించాడు.ఎవరికి ఏ నష్టం కలిగినా..ఎంత కోపమొచ్చినా దాన్ని సాటివారిపై దాడులకు దిగేందుకు వాడుకోవడం సరికాదని హితవు చెప్పారు.కోర్టులు,ప్రభుత్వాలు ఉండగా వాటిని పట్టించుకోకుండా హింసాత్మక చర్యలకి దిగడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు.ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని కుండబద్ధలు కొట్టారు.అందరం భారతీయులమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పిలుపు ఇచ్చాడు.ఈ ఇద్దరి ప్రకటనలు చూశాక సమస్యాత్మక అంశాలపై స్పందనలో భారతీరాజా కన్నా ప్రకాష్ రాజ్ ఎంతో బెటర్ అనిపించాడు.

SHARE