ప్రకాష్ రాజ్ రియల్ లైఫ్ లో కూడా కరుకేనా..!!

0
411
prakash raj break the fan mobile at chennai airport

Posted [relativedate]

prakash raj break the fan mobile at chennai airportఇటీవల బాలకృష్ణ.. సెల్ఫీ తీసుకోబోతున్న  ఓ అభిమాని ఫోన్ ని విసిరి కొట్టాడని పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఫేమస్ నటుడు కూడా అలానే అభిమాని ఫోన్ ని బద్దలు కొట్టాడు.

వివరాల్లోకి వెళ్తే..

ప్రకాష్ రాజ్.. క్యారక్టర్ రోల్స్ ప్లే చేయడంలో అందెవేసిన చేయి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్.. పాత్రల పరంగా సినిమాలో లోతైన కరకుదనాన్ని ప్రదర్శిస్తుంటారు. అది సినిమాల వరకు బాగానే ఉంటుంది కానీ నిజజీవితంలో కూడా అలానే కరకుదనాన్ని ప్రదర్శిస్తే బాగుండదు. సరిగ్గా అదే పని చేశాడు ఈ  ఫేమస్ స్టార్. దీంతో విమర్శల పాలయ్యాడు. చెన్నై ఎయిర్ పోర్ట్  నుంచి బయటకు వచ్చిన ప్రకాష్‌ రాజ్‌ ను అభిమానులు చుట్టుముట్టారు. అందులో బెంగళూరుకు చెందిన ఓ అభిమాని కొంచెం దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకోబోయాడు. అంతే ప్రకాష్ రాజ్ కి కోపం కట్టలు తెంచుకంది. అతడి మొబైల్ లాక్కుని నేలకేసి బద్దలు కొట్టాడు. ప్రకాష్ రాజ్ దురుసు ప్రవర్తన చూసిన అభిమానులు  నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ అక్కడ నుండి జంప్ అయ్యాడు. సెల్ఫీ తీసుకోయిన సదరు అభిమాని.. ప్రకాష్ రాజ్ మీద ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

వెండితెరపై నటీనటులు ప్రదర్శించే ప్రతిభకు పిధా అవుతుంటారు అభిమానులు. అటువంటి తారలు  ఒక్కసారిగా తమ ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి అభిమానుల సంతోషం కట్టలు తెంచుకోవడం సహజం. తారలను నేరుగా  చూసిన మధురక్షణాన్ని తమ ఫోన్లో బంధించుకోడానికి తాపత్రయ పడుతుంటారు. అలా వచ్చిన అభిమానులపై దురుస ప్రవర్తనను సెలబ్రిటీలు మానడం మంచిది. సదరు సెలబ్రిటీల సినిమాలను  ఎంతో ఓపికగా చూసి వాటిని హిట్ చేస్తున్న అభిమానుల పట్ల వారు కూడా కాస్త  ఓపిగ్గా ఉండాలని నిపుణులు అంటున్నారు. అలానే తారలు కనపడగానే ఒక్కసారిగా చుట్టుముట్టు వారిని ఇబ్బందిపెట్టకుండా అభిమానులు కూడా కాస్త మర్యాదగా నడుచుకోవాలి.

Leave a Reply