కళ్యాణ్ రామ్ ఆకలి చూసిన ప్రకాష్ రాజ్ ..

Posted October 6, 2016

  prakash raj sensational comment kalyan ram ism audio function
ఇజం సినిమా ఆడియో విడుదలకి వచ్చిన ప్రకాష్ రాజ్ కళ్యాణ్ రామ్ గురించి భలే మాట చెప్పాడు.ఓ నటుడిగా కళ్యాణ్ ఆకలితో వున్నాడని…ఆ ఆకలిని సాటి నటుడిగా తాను చూడగలుగుతున్నట్టు ప్రకాష్ వివరించాడు.ఇక పూరి క్లాస్,మాస్ రెండు వర్గాలకి కావాల్సింది ఇవ్వగలిగిన దర్శకుడని అయన ప్రకాష్ రాజ్ పొగిడాడు.మరి కొందరు సినీ ప్రముఖులు ఇజం ఆడియో వేడుకలో చెప్పిన మాటలివి..

బివిఎస్ఎన్ ప్రసాద్: “విజువ‌ల్స్ మామూలుగా లేవు. చాలా పెద్ద సినిమా అవుతుంది అని చెప్పగలను” అని చెప్పారు.

హేమంత్ మ‌ధుక‌ర్ : “సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది.  టీజ‌ర్ , పాట‌లు బావున్నాయి” అని అన్నారు .

భాస్క‌ర‌భ‌ట్ల: “పూరి జ‌గ‌న్నాథ్‌ గారి తో పని చేస్తోన్న 24వ‌ సినిమా ఇది. అయన ఇచ్చిన సపోర్ట్ కి ఎప్పటికి రుణ పది ఉంటాను. ఆయనకి రాయ‌డంలో కంఫ‌ర్ట్ ఉంటుంది. . అనూప్‌తో ప‌నిచేస్తున్న మూడో సినిమా ఇది. క‌ల్యాణ్‌ రామ్ గారి కి  తొలిసారి పాటలు రాయ‌డం ఆనందంగా ఉంది” అని అన్నారు.

దిల్‌ రాజు :  “ఇజం” పాట‌ల‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న వ‌స్తోంది. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.  మా సంస్థ‌కు ఈ ఏడాది బావుంది. టీజ‌ర్ చూస్తే ఇడియ‌ట్ సినిమా గుర్తుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒక గంటా రెండు నిమిషాలుంటే, సెకండ్ హాఫ్ గంటా ఐదు నిమిషాల నిడివి ఉంది. మంచి రేంజ్ ఉన్న సినిమా అవుతుంది ” అని తెలిపారు.

అలీ : “క‌ల్యాణ్‌రామ్ మంచి మ‌న‌సున్న హీరో. ఎక్క‌డా గ‌ర్వం అనేది ఉండ‌దు. కళ్యాణ్ పూరీ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ” అని అన్నారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి : “మా నర్సీపట్నం కుర్రోడు ఇవాళ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు అంటే గర్వం గా ఉంది. ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం నుంచి నాకు పూరి జ‌గ‌న్నాథ్‌తో ప‌రిచ‌యం ఉంది. ఇజం చిత్రం క్లైమాక్స్ చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి. ఏడు నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ ను క‌ల్యాణ్ రామ్ ఇర‌గ‌దీశాడు.” అని అన్నారు .

అనూప్ రూబెన్స్: “క‌ల్యాణ్‌రామ్‌గారితో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ అవకాశం ఇచ్చిన పూరి గారికి, కళ్యాణ్ గారికి థాంక్స్” అని అన్నారు.

అదితి ఆర్య : “క‌ల్యాణ్‌ రామ్ గారు పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చారు. పెద్ద హీరో. ఆయన చాలా ఆరోగెంట్‌గా ఉంటారేమో అని భయపడ్డా. కానీ ఆయన చాలా సాఫ్ట్ , డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. ఈ చిత్రం లో అవకాశం ఇచ్చినందుకు ఆయనకి,  పూరి గారి కి థాంక్స్ . ఈ చిత్రం లో నటించటం చాలా బాగుంది” అని తెలిపారు.

SHARE