Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ”…ఇదేదో ప్రభుత్వ సంస్థ,లేదా స్వచ్చంధ సంస్థ అనుకునేరు.అలాంటిదేమీలేదు.ఎన్నికల వ్యూహకర్తగా పార్టీల నుంచి భారీ ఫీజ్ లు వసూలు చేసి సలహాలు ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ నడుపుతున్న సంస్థ ఇది.ఇందులో దాదాపు వందమందితో కూడిన ఓ టీం వుంది.ఎక్కువమంది ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళే.వీళ్ళ జీతాలు కూడా భారీ గానే ఉంటాయి.అలాంటి టీం ని మైంటైన్ చేయడం అంత తేలిగ్గాదు.ఆర్ధికంగా భారంతో కూడినది. అందుకే ప్రశాంత్ కిషోర్ తన క్లైంట్స్ దగ్గర కూడా అందుకు తగ్గట్టు వసూలు చేస్తాడట.
తాజాగా ఏపీ ఎన్నికల బరిలోకి వైసీపీ వ్యూహకర్తగా బరిలోకి దిగుతున్న ప్రశాంత్ కిషోర్ ఫీజ్ ఎంతో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి.ప్రశాంత్ ఈ టాస్క్ కోసం కోట్ చేసిన అమౌంట్ అక్షరాలా 250 కోట్లు అంట.ఈ ఫీజ్ ఎక్కువే అయినా జగన్ ఆయన్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది.వెంటనే ప్రశాంత్ టీం ఏపీ లో పొలిటికల్ పిక్చర్ ని స్కాన్ చేస్తుందట.ఆ తర్వాత వ్యూహప్రతివ్యూహాలు,ప్రచారం,హామీలు వంటి అన్ని అంశాల్లో తమదైన సలహాలు ఇస్తూ ఎన్నికలు అయ్యేదాకా ప్రతి విషయంలో వైసీపీ కి అన్ని విధాలుగా అందండలు అందిస్తుందట.మొత్తం 175 సీట్ల లో పెట్టే ఖర్చు గాకుండా ఒక్క వ్యూహరచన మీదే ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం చూసి వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. జగన్ ఇంతకుముందెన్నడూ లేనంతగా డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని కూడా వాళ్ళు సంబరపడుతున్నారు.అయితే రీసెంట్ గా యూపీ లో ప్లాప్ అయిన ప్రశాంత్ హిట్ కాగలడా,ఈ డీల్ వర్కౌట్ అవుతుందా అన్న డౌట్ మాత్రం వారిని లోలోన భయపెడుతూనే వుంది.