ప్రవీణ్ బయటకొచ్చాడు..జగన్ వద్దంటున్నాడు..

0
666

 praveen kumar reddy ysrcp  jagan mohan reddy dont want
ప్రవీణ్ కుమార్ రెడ్డి …చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నేత ..అంతకన్నా అయన గురించి బాగా తెలుసుకోవాలంటే 2004 నుంచి 2011 దాక టీవీ చర్చల్లో చూడాల్సింది …తెలుగు దేశం తరుపున తెగ వాదించేవాళ్ళు .ఆదినుంచి టీడీపీ కి అండగా ఉంటున్న కుటుంబం నుంచి వచ్చి 2009 లో ఎమ్మెల్యే గా గెలిచారు.టీవీ చర్చల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దేశం శ్రేణుల అభిమానం పొందగలిగారు.అయితే అదంతా పక్కనపెట్టి ఉపఎన్నికల ఫలితాల మోజులో పడి 2012 లో వైసీపీకి జై కొట్టారు .2014 లో ఆ పార్టీ సీటు దక్కినా టీడీపీ కంచుకోట తంబళ్లపల్లి లోగెలుపు మాత్రం దక్కలేదు.

అధికారం కోసం వెంపర్లాడి ఇటునుంచి అటు ,అటునుంచి ఇటు మారినా రెండుసార్లు ప్రయోజనం లేకుండా పోయింది.దీంతో డీలా పడ్డ ప్రవీణ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు .వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకున్న వైసీపీ అధినేత జగన్ ఊరుకుంటాడా ?పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాధ్ రెడ్డి కి తంబళ్లపల్లి బాధ్యతలు అప్పజెప్పాడు.దీంతో ఉలిక్కిపడ్డ ప్రవీణ్ బయటకొచ్చి నేనే పని చేస్తా..ఇది నా సొంత నియోజకవర్గం అని ఎంత మొత్తుకున్నా వినే నాధుడే లేడు.

అటు పాతపార్టీ దేశం వైపు చూద్దామంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వున్నాడాయే …ఎన్ని పార్టీలు మారినా ఎమ్మెల్యే పీఠం కాదుకదా కనీసం పార్టీ ఇంచార్జి పోస్ట్ కూడా ఊడిపోయి ప్రవీణ్ అల్లాడిపోతున్నారు.ఒక్క నిర్ణయం రాజకీయాల్లో ఎంత ఖరీధైనదో ప్రవీణ్ కి అర్ధమైంది కానీ అప్పటికే కాలాతీతమైంది.అందుకే ఓటమి తాలూకు అనుభవాన్ని రంగరించి కొత్త ఎత్తుల కోసం కసరత్తు చేస్తున్నాడు ..పాపం ప్రవీణ్..

Leave a Reply