ఆ కాంతుల వెనక కామపిశాచులు

0
611

precaution finding trial room cameras

షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ … ఇలా ఎక్కడికెళ్లినా పట్టపగలు కూడా లైట్ల కాంతులు జిగేల్ మన్పిస్తుంటాయి. ఆ కాంతులు మహిళల అందాల్ని ఆబగా చూస్తున్నాయని తెలుసా? ఔను ఇది నిజం. ట్రైల్ రూమ్స్, బాత్రూమ్స్ … ఇలా వివిధ చోట్ల వెలిగే లైట్లలో కెమెరా కూడా ఫిక్స్ అయిపోయి వుంటుంది. అది లైట్ కదా అనుకున్నామంటే మన పరువు … వేరే వారి చేతిలో పడ్డట్టే. చూడటానికి మాములు లైట్ల లాగే కన్పించే … ఈ కామకాంతుల గుట్టు విప్పడానికి ఓ చిట్కా వుంది.

షాపింగ్ మాల్ ట్రైల్ రూం లేదా మల్టిప్లెక్స్ బాత్రూమ్ … ఇలా ఎక్కడికైనా మీతో పాటు ఫోన్ తీసుకెళ్లండి. దాంతో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చూడండి. ఫోన్ పనిచేసిందంటే అక్కడి లైట్లు సాధారణమైనవి. ఫోన్ పనిచేయలేదంటే ఆ కాంతుల వెనక కామపిశాచులు కళ్ళున్నట్టే…ఆ కెమెరాలతోపాటు వుండే జామర్లు మీ ఫోన్ పనిచేయకుండా ఆపేస్తాయి. ఈ చిన్న చిట్కా ఫాలో అయితే పెద్ద పెద్ద ఇబ్బందులనుంచి మహిళలు బయటపడవచ్చు. ఈ చిట్కాని మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. కామాంధుల వల్ల వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూడండి.

Leave a Reply