లైంగికంగా వేధించిన వాడితో మళ్లీ కలిసిపోయిన ఆ హీరోయిన్..!

0
318
preity zinta wadia again close together

Posted [relativedate]

preity zinta wadia again close togetherప్రీతి జింతా.. ప్రేమంటే ఇదేరా మూవీతో మన టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. స్పోర్ట్స్ మీద ఇష్టం వలన ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఓనర్ గా మారింది తర్వాత మహేష్ బాబు కు జోడి గా రాజకుమారుడు లో నటించింది ఈ చొట్ట బుగ్గల సుందరి.ఒకప్పుడు ప్రీతి జింతా నెస్ వాడియా ఇద్దరూ మంచి ప్రేమికులు.. ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం ని కొని వ్యాపార భాగస్వాములుగా కూడా మారారు. కొంతకాలం సహజీవనం కూడా చేసి ఆ తర్వాత పెళ్లికి కూడా సిద్ధపడ్డారు.

కానీ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి వెళ్ళాయి… అవి ఎంత దూరం వెళ్ళింది అంటే వాడియా మీద ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వచ్చింది. ప్రీతి జింతా పోలీసులకు వాడియా నన్ను లైంగికంగా వేధింస్తున్నాడని,నా మీద అత్యాచారం కూడా చేయబోయాడని కేసు పెట్టింది. అలా చేసిన ఈ భామ సడెన్ గా ఏమైందో ఏమో గాని ఇప్పుడు ఆ గొడవలన్నీ మర్చిపోయి ఇద్దరూ మళ్లీ స్నేహితులైపోయారు.

ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభమైనప్పటి నుంచి పంజాబ్ మ్యాచ్ ల సందర్భంగా స్టాండ్స్ లో ప్రీతి, వాడియా చాలా క్లోజ్ గా ఇద్దరూ ముచ్చటించుకుంటూ కినిపిస్తున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ఇద్దరూ తమ జట్టు ఆటగాళ్లతో కలసి సంబరాలు కూడా చేసుకున్నారు. తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన వ్యక్తితో మళ్లీ ఇలా ప్రీతి సన్నిహితంగా కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక వాడియా నుంచి విడిపోయాక ప్రీతి జింతా జీన్ గుడ్ ఎనఫ్ అనే విదేశీయుడితో ప్రేమాయణం మొదలుపెట్టి అతడినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Leave a Reply