సమంత,చైతు జీవితాల్లో శుక్రవారం మహిమ..

Posted October 8, 2016

  premam change naga chaitanya samantha life

ఒక్క శుక్రవారం అలా వచ్చి వెళ్లిందంటే బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి.జీరో హీరో అవ్వొచ్చు.హీరోనే జీరోగా మారొచ్చు.ఈసారి శుక్రవారం మాత్రం ఆ లెక్కలు మార్చిందోలేదో గానీ వెండితెరపై మనకు పరిచయమైన ఇద్దరు నటుల్ని,ప్రేమికుల్ని,దంపతులు కాబోతున్న వారిని సరికొత్తగా ఆవిష్కరించింది.వాళ్లే చైతు, సమంత. వారినలా ఆవిష్కరించింది మాత్రం ఓ సినిమానే.అదే ప్రేమమ్.

చైతు…ఓ పెద్దింటి కుర్రోడు..పుట్టుక తోనే అన్నీ అమిరినవాడు.కాకపోతే సిగ్గు,బిడియం వల్ల పెద్దగా మాట్లాడడు.కొందరు దాన్ని పొగొరని ఫీల్ అయి ఉండొచ్చు. అవన్నీ నిజం కాదని చిన్న వయసులోనే లోతైన ఆలోచలున్న వాడని ప్రేమమ్ ప్రమోషన్స్ లో చైతు మాట్లాడుతుంటే అర్ధమైంది.జుట్టు నెరవడానికి ..కష్టాల్లో బతకడానికి..జీవితాన్ని అర్ధం చేసుకోడానికి సంబంధం లేదని చైతు మాటలతో స్పష్టమైంది.

అన్నిటికన్నా గొప్ప విషయం సమంత గురించి చైతు విశ్లేషణ .అన్ని ఉన్న తనకన్నా ఎన్నోకష్టాలకోర్చి ఈ స్థాయికి వచ్చిన సమంత గ్రేట్ అని చెప్పడం చైతు కే చెల్లింది.ఇక ప్రేమమ్ సక్సెస్ ని చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తుంటే..ఆమె ఓ నటి అని గుర్తు రావడం లేదు.పల్లెల్లో వరసైన బావని చూస్తూ మురిసిపోయే అమాయకపు మరదలు గుర్తొస్తోంది.ఏమైనా ఆ ఇద్దరిలో కొత్త కోణాన్ని పరిచయం చేసిన ప్రేమమ్ సినిమాకి కాబోయే కొత్త దంపతుల తరపున తెలుగు బులెట్ థాంక్స్ చెబుతోంది.మనం మర్చిపోయినా ఈ శుక్రవారం చైతు,సమంత జీవిత పుస్తకాల్లో పెద్ద చోటే దక్కించుకుంటుంది.

[wpdevart_youtube]jV2hMvAMgFU[/wpdevart_youtube]

SHARE