ప్రేమమ్‌ బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌

 

premam heroine madonna sebastian pair up with vijay devarakondaనాగచైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్‌’ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం  ప్రేమమ్‌కు తెలుగులో నాగచైతన్య అదే టైటిల్‌తో రీమేక్‌ చేశాడు. ఆ సినిమాలో ఒక హీరోయిన్‌గా మడోనా సెబస్టీయన్‌ నటించిన విషయం తెల్సిందే. చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా కనిపించిన ఈ అమ్మడిని తెలుగులో అప్పటి నుండి కూడా సరైన అవకాశం రాలేదు. చిన్నా, చితకా వేశాలు వచ్చినా కూడా వదిలేసుకుంది. తాజాగా హీరోయిన్‌ ఛాన్స్‌ మడోనాకు వచ్చింది.

‘పెళ్లి చూపులు’ చిత్రంతో సంచన విజయాన్ని సొతం చేసుకున్న విజయ్‌ దేవర కొండ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతుంది. తాజాగా మరో సినిమాకు ఈయన కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా మడోనా సెబాస్టియన్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఇటీవలే ధనుష్‌ నిర్మించిన సినిమాలో నటించిన ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమా తర్వాత ఫుల్‌ బిజీ అయ్యే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. మడోనా సెబాస్టియన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here