మెగా మేనల్లుడికి విలన్ గా మారిన స్నేహ భర్త..!!

0
402
presanna as villan for saidharam tej movie

Posted [relativedate]

presanna as villan for saidharam tej movie
మెగా కాంపౌడ్ హీరో సాయి ధరమ్ తేజ్ మంచి జోష్ మీద ఉన్నాడు. ఆ జోష్ తోనే మొదలుపెట్టిన తాజా సినిమా జవాన్. నిన్న పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు ప్రముఖ రైటర్ బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే… ఈ మెగా మేనల్లుడి సినిమాలో హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న విలన్ గా నటిస్తున్నాడట.

కోలీవుడ్ లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసన్న ఇంతకుముందు నాగార్జున హీరోగా నటించిన ‘భాయ్’ సినిమాలో నటించాడు. ఆ మూవీలో అతడి నటనకు ప్రశంసలు వచ్చినా, ఆఫర్లు మాత్రం రాలేదు. దాదాపు 3 సంవత్సరాల తరువాత మళ్లీ ‘జవాన్’లో నటించేందుకు సిద్ధమౌతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా అతని లక్ తిరుగుతుందేమో చూడాలి.

Leave a Reply