సాగుతున్న స్థాని’కత’

159

prevailed localism
కొత్త రాష్ట్రానికి వెళ్లే వారి పిల్లలకు స్థానికత కల్పిరచేరదుకు సిద్ధం చేసిన ఫైలు అతీ గతీ లేకుండా అయిపోయింది. దాదాపు 20 రోజుల క్రితమే పూర్తి మార్గదర్శకాలతో కూడిన స్థానికత ఫైలు సిఎస్‌ వద్దకు చేరుకురది. అరతా బాగానే ఉందని ఉద్యోగ సంఘాల నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందనుకురటున్న సమయంలో ఇరకా దీనిపై తాత్సారం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా కేంద్రం వద్ద జాప్యం జరగాల్సి ఉన్నప్పటికీ, కేంద్రం చాలా వేగంగా అనుమతి మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో మాత్రం ఎక్కువ జాప్యం జరుగుతురడడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు.

వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఐదో బ్లాకులోని ఎగువ అంతస్తులో 11వ తేదీన జరగాల్సిన పలు శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవం వాయిదా పడ్డాయి. రహదారులు, భవనాలు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జె.శ్యాంబాబు, విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంట్‌, రవాణా శాఖ తదితర కార్యాలయాలు ఇక్కడ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పనులు పూర్తి కాలేదని తెలిసి ఉద్యోగులు, అధికారులు వెలగపూడికి బయలుదేరి వెనుదిరిగినట్టు సమాచారం. వాస్తవంగా ఈనెల 6వ తేదీ నాటికి ఐదో బ్లాక్‌లో మొదటి అంతస్తు సిద్ధం చేస్తారని సిఎం ప్రకటించారు. వర్షాల కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని, 11వ తేదీకి సిద్ధమవుతాయని మాట మార్చారు. 11వ తేదీకి కూడా ఈ బ్లాక్‌లోని మొదటి అంతస్తు సిద్ధం కాలేదు. మళ్లీ ఈనెల 15 కల్లా మొత్తం ఐదు బ్లాకులు దిగువ అంతస్తుల్లో పనులు పూర్తవుతాయని సిఎం ప్రకటించినా ఇంత వరకూ పనులు పూర్తవుతాయన్న దాఖలా కన్పించడం లేదు. సిఎం, మంత్రులు చెబుతున్న మాటలకూ, వెలగపూడిలో జరుగుతున్న పనులకూ ఏమాత్రం పొంతన లేదు. కార్యాలయం బయట కూడా మౌలిక సదుపాయాల పనులు ఇంకా వేగం పుంజుకోలేదు.

దీంతో తాత్కాలిక సచివాలయంలో తొలిసారిగా గత నెల 29న ప్రారంభమైన గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి, కార్మిక, పంచాయతిరాజ్‌ శాఖల ముఖ్యకార్యదర్శుల కార్యాలయాల్లోనూ అధికారుల పాలన ఇంకా ప్రారంభం కాలేదు. మౌలిక సదుపాయలు మెరుగుపడకపోవడంతో ప్రారంభించిన ఈ నాలుగు శాఖల అధికారులు కూడా విధులు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. కనీస సదుపాయాలు లేకుండా తరలిరాలేమని హైదరాబాద్‌లోని సచివాలయ ఉద్యోగులు తేల్చిచెప్పారు. దీంతో వెలగపూడి కేంద్రంగా పూర్తిస్థాయి పాలనకు మరో నెల రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here