Friday, September 30, 2022
HomeEntertainmentCinema Latestఆ సినిమాకు ప్రధాని మోడీ సపోర్ట్‌

ఆ సినిమాకు ప్రధాని మోడీ సపోర్ట్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రధాని మోడీ పక్కా హిందుత్వ వాది అనే విషయం జగమెరిగిన సత్యం. బీజేపీ దేశంలో హిందుత్వంను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకోసం హిందు మత ప్రచారంను కూడా బీజేపీ చేస్తుంది. హిందువులకు కాస్త ఎక్కువగా మోడీ ప్రభుత్వం సపోర్ట్‌ చేస్తుందనే విషయం ప్రతి ఒక్కరు ఒప్పుకునే విషయం. ఇప్పుడు మరోసారి ఆ విషయం నిరూపితం కాబోతుంది. మహాభారతం నేపథ్యంలో వెయ్యి కోట్లతో ఒక సినిమాను తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ఆ సినిమా తెరకెక్కబోతుంది. భారీ అంచనాలున్న ఆ సినిమాను వెయ్యి కోట్లతో ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే సంవత్సరంలో సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా హిందుత్వంకు సంబంధించిన సినిమా అవ్వడంతో పాటు మహాభారతం ఈతరం ప్రేక్షకులకు తెలియాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ సినిమాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఆ సినిమాకు సంబంధించిన పన్ను అంతా కూడా రాయితీ రూపంలో రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

- Advertisment -
spot_img

Most Popular