తెరపైకి జయలలిత కూతురు?

0
348

Posted [relativedate]

priya mahalakshmi says iam daughter of jayalalithaపురుచ్చితలైవి జయలలితకు ఓ కూతురుందా? ఎంజీఆర్-జయలలిత బంధానికి గుర్తుగా పాప పుట్టిందా? ఇన్నాళ్లూ ఆమె బయటకు రాకుండా శశికళే అడ్డుకుందా? అంటే ఔననే అంటోంది ఓ మహిళ.

ఎంజీఆర్- జయలలితకు ఓ కూతురు పుట్టిందట. ఆమెకు పేరు ప్రియా మహాలక్ష్మి అట. ఈ వివరాలు చెప్పిందెవరో కాదు. ప్రియా మహాలక్ష్మి అనే మహిళ. చిన్నప్పుడే అమ్మ ప్రేమకు ఆమె దూరమైపోయిందట. ఈ విషయం చిన్నమ్మకు కూడా తెలుసట. అయితే జయలలిత దగ్గరకు రాకుండా మహాలక్ష్మిని … శశికళే అడ్డుకుందని ప్రియా మహాలక్ష్మి చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రియా మహాలక్ష్మి వాదన ప్రకారం ఆమె ఇన్నాళ్లూ శశికళకు భయపడి అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోయింది. శశి జైలుకు వెళ్లిపోవడంతో ఆమె తెగించి బయటకు వచ్చిందట. ఈ మహాలక్ష్మి ప్రస్తుతం ఓ కార్మికుల సంఘానికి పార్టీకి కోశాధికారిగా ఉందని సమాచారం.

అసలే అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అటు ఇప్పటికే శశిళక వర్గం, పన్నీర్ సెల్వం వర్గం, దీనికి తోడు దీప వర్గం.. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు ఈ ప్రియా మహాలక్ష్మి లొల్లి. ఉన్న గొడవతోనే సరిపోవడం లేదంటే… కొత్తగా ఈ ప్రియ ఎవరని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఎంతకైనా మంచిదని అన్నాడీఎంకేలోని కొందరు ఎమ్మెల్యేలు ఈ ప్రియతోనూ మాట్లాడేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. అంతే మరి .. ఏ పుట్టలో ఏ పాముందో!! అందుకే ఎవరి జాగ్రత్తల్లో వారుంటున్నారు.

Leave a Reply