‘బాహుబలి 2’లో తెలుగమ్మాయి !

 Posted October 21, 2016

 priya naidu in bahubali2 movie

బాహుబలి.. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం. అయితే, బాహుబలిలో ఒక్క తెలుగమ్మాయి కూడా లేకపోవడం విచారకరం. ‘బాహుబలి’ మూడు లేడీ ప్రధాన పాత్రలున్నాయి. శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నాలు నటించారు. వీరిలో రమ్యకృష్ణ-తమిళనాడు, అనుష్క-కర్నాటక, తమన్నా-మహరాష్ట్రకు చెందిన వారు. వీరు టాలీవుడ్ లో సెట్టయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో ఒక్క తెలుగమ్మాయి కూడా లేదు. అయితే, బాహుబలి సీక్వెల్ బాహుబలి 2లో మాత్రం ఆలోటు తీరనుంది.

తాజాగా, బాహుబలి 2 కోసం ఓ తెలుగమ్మాయిని తీసుకొన్నారు. మోడల్ గా సత్తా చాటుతున్న ప్రియా నాయుడు బాహుబలి 2 కోసం ఎంపికైంది. ఓ సపోర్టింగ్ రోల్ కోసం ప్రియాని తీసుకున్నట్టు తెలుస్తోంది. “నా కజిన్ సిద్ధార్ధ్.. నా పోర్ట్ ఫోలియో చూపిస్తే.. ఆడిషన్ కి రమ్మన్నారు. తర్వాత రోజు నుంచే షూటింగ్ కి వచ్చేయమన్నారు. నా తొలిసినిమా రాజమౌళిలాంటి దర్శకుడితో చేస్తుండడంతో.. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా” అంటూ మురిసిపోతోంది ప్రియా నాయుడు.

అయితే, బాహుబలి కంటే ముందు ఈ తెలుగమ్మాయికి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’లో నటించే ఛాన్స్ వచ్చింది. వంశీ నక్షత్రంలో ప్రీయా పాత్ర ఏమిటన్నది ఇంకా తెలియదు. మొత్తానికి.. బాహుబలిలో ఓ తెలుగమ్మాయి కనిపించబోతుందన్న న్యూస్ ఆసక్తికరంగా  ఉంది. 

SHARE