మరోసారి పిచ్చెక్కించనున్న ప్రియమణి…

 Posted March 27, 2017

priyamani new movie dhwaja2011లో వచ్చిన రగడ సినిమా తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు ప్రియమణి. పెళ్లైనకొత్తలో, యమదొంగ, శంభో శివ శంభో, కింగ్, గోలీమార్ వంటి నాలుగైదు సినిమాలు తప్ప ఆమె కెరీర్ లో  విజయాలు ఎక్కువగా లేకపోయినా ఆమె నటన,  అందచందాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. గతేడాది మన ఊరి రామాయణం సినిమాలో కనువిందు చేసిన ఈ అమ్మడు   తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని కవర్ చేసింది. అలానే బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. అయితే శాండిల్ వుడ్ లో తప్ప ఇక ఎక్కడా తన  స్టార్ డమ్ ని కొనసాగించలేకపోయింది. దీంతో శాండిల్ వుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కాంచన-2, గీతాంజాలి కన్నడ రీమేక్స్ లో నటిస్తున్న ప్రియమణి తాజాగా మరో చిత్రానికి సైన్ చేసింది.

 పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఆ సినిమా పేరు ధ్వజ. గిరీష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాలో  రవి గౌడ అనే కొత్త హీరో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ తెలిపింది. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేసి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయనున్నామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరి ఈ తెలుగు డబ్బింగ్ సినిమాతోనైనా ప్రియమణికి మళ్లీ టాలీవుడ్లో ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

SHARE