మగాళ్లు సెక్స్ కోసమేనా?

Posted December 29, 2016

priyanka chopra talking about sexబేవాచ్ సినిమాతో హాలీవుడ్ లోను జెండా ఎగరేయడానికి ఉవ్విళ్లూరుతున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ బోల్డ్ స్టేట్ మెంట్ తో షాక్ ఇచ్చింది.మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధిస్తున్నారని చెప్పిన ఈ అమ్మడు ఇక అవసరాల కోసం మగోళ్ళపై ఆధారపడే పరిస్థితి లేదంది. అంతటితో ఆగితే ఎలా ఉండేదో కానీ ఇంకో అడుగు ముందుకేసి అసలు మగాళ్లతో పనేముంది?సెక్స్ అవసరాలు,పిల్లల్ని కనడానికి తప్ప అనేసింది.

ఆమె దృష్టిలో అది నిజమే కావొచ్చు గానీ ప్రకృతి ఈ సూత్రాన్ని ఒప్పుకోదు …పైగా అది మాట్లాడినంత తేలిగ్గాదు.ఒకవేళ మగాళ్లు కూడా ఆడదానితో ఆ ఒక్క పనే కదా అనుకుంటే ఏమవుతుంది? పుట్టే పిల్లలకి సామాజిక భద్రత ఎక్కడనుంచి వస్తుంది? తాము ఇద్దరి సెక్స్ అవసరాలకే పుట్టామని …ఇద్దరి ప్రేమ వల్ల కాదని తెలిసిన పిల్లల భావోద్వేగాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రియాంక చోప్రాకి లేకపోవచ్చు.కానీ ఆమె లాంటి సెలబ్రిటీ ఇచ్చే ఆ ప్రకటన ప్రభావం సమాజం మీద ఎలా పడుతుందో ఆ సారి ఆలోచిస్తే మంచిది.ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమంటే …ఇంకోరిని అవమానపరచడం కాదు..కాకూడదు ..ఓ సమస్య నుంచి ఇంకో సమస్యకి కాదు పరిష్కారానికి అడుగు ముందుకు పడాలి.

SHARE