రాహుల్,అఖిలేష్ మధ్య ప్రియాంక?

Posted January 6, 2017

priyanka in between rahuland akhilesh
అంతకంతకూ దిగజారుతున్న కాంగ్రెస్ ప్రతిష్ట నిలబెట్టేందుకు ప్రియాంక గాంధీ రెడీ అయ్యారా? రెడీ కావడమే కాదు ఆల్రెడీ రంగంలోకి కూడా దిగిపోయారు.కాదనుకున్న ఓ పని కూడా విజయవంతంగా పూర్తి చేశారు.అదేమిటంటే …యూపీ లో పొత్తుల వ్యవహారం.యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బాధ్యతని నెత్తికెత్తుకున్న ప్రశాంత్ కిషోర్ పొత్తుల ఆలోచనను ప్రియాంక అమల్లోకి తెస్తున్నారు.ఇప్పటికే ఆమె అఖిలేష్ తో సమావేశమై పొత్తుల గురించి ప్రాధమిక అవగాహనకి వచ్చారు.యూపీ లో కాంగ్రెస్ 10 స్థానాలకే పరిమితం అని సర్వే లు చెప్తున్నా అఖిలేష్ ని ఒప్పించి ఆ పార్టీకి దాదాపు 100 స్థానాలు కేటాయించేలా ప్రియాంక ఒప్పించినట్టు తెలుస్తోంది.

సమాజ్ వాది లో అంతర్గత వ్యవహారం ముగియగానే కాంగ్రెస్ యువరాజు రాహుల్,అఖిలేష్ మధ్య పొత్తుకు సంబంధించి తుది దశ చర్చలు జరుగుతాయంట.ఈ చర్చల్లో రెండు పక్షాల మధ్య ప్రియాంక అనుసంధాన కర్తగా ఉంటారని తెలుస్తోంది.కాంగ్రెస్ ,సమాజ్ వాది మధ్య పొత్తు కుదిరితే మంచి ఫలితాలు వస్తాయని సర్వే లతో పాటు రెండు పార్టీలు భావిస్తున్నాయి.ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే 300 సీట్లు గెలుస్తామని అఖిలేష్ అంచనా.ఏదేమైనా కష్ట,క్లిష్ట దశలో ప్రియాంక ముందుకొచ్చి యూపీ లో పొత్తుల రూపంలో కాంగ్రెస్ పరువు నిలబెట్టినట్టే కనిపిస్తోంది.

SHARE