ఎన్టీఆర్ కి బ్లాంక్ చెక్…

Posted September 29, 2016

  producer giving ntr blank check

వరుసగా మూడు హిట్లు కొట్టడంలో ఎన్టీఆర్ స్టామినా బాక్సాఫీస్ కి మరోసారి తెలిసొచ్చింది. కొన్నేళ్లుగా ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ఇంకా కొత్త సినిమా ఒప్పుకోలేదు.కానీ నిర్మాతలు మాత్రం ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.  స్టోరీ ఫైనలైజ్ అయ్యాక చూద్దామని ఎన్టీఆర్ చెప్పినా వినకుండా ఓ భారీ ప్రొడ్యూసర్ బ్లాంక్ చెక్ ఆఫర్ ఇస్తానన్నాడట. గతంలో కూడా ఈ నిర్మాత ఎన్టీఆర్ తో వరసగా మూడు సినిమాలు తీయాలని ఎగ్రిమెంట్ కోసం ప్రయత్నించాడు. డబ్బుకి కొడవలేకపోయినా సక్సెస్ కోసం ఆవురావురుమంటున్న ఈ భారీ ప్రొడ్యూసర్ నకు బిజినెస్ మెన్ ఇపుడు తారక్ కోసం గట్టి ప్రయత్నాలే మొదలెట్టాడు. ఈ ఆఫర్ ని తారక్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.

మరోవైపు జనతా గ్యారేజ్ నిర్మాతలు కూడా మరో సినిమా తారక్ తో చేయాలనీ భావిస్తున్నారు. వాళ్ళు కూడా తారక్ అడిగినంత ఇవ్వడానికే సిద్ధమని చెప్పారట. సక్సెస్ చుట్టూ చిత్ర రంగం పరిభ్రమిస్తుంది అనడానికి ఇంతకంటే మించి ఉదాహరణ ఏముంటుంది?.

SHARE