నయీమ్ కి ఆ మంత్రితో ? నట్టి ఆరోపణ

0
588

nayeemటాలీవుడ్ లోనూ నయీం నేర సామ్రాజ్యం విస్తరించినట్లు నిర్మాత నట్టికుమార్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిర్మాతలు బండ్ల గణేష్, సి కల్యాణ్, అశోక్ కుమార్ అందరకీ నయీం తో సన్నిహిత సంబంధాలున్నాయని నట్టికుమార్ ఆరోపించారు. థియేటర్లను సైతం నయీం కబ్జా చేశాడని, వాటిలో క్యాంటిన్లంటిన్నిటీనీ నయీం మేనేజ్ చేస్తున్నాడని, అతని అనుచరుడు జగ్గిరెడ్డి వీటి వ్యవహారాలు చూస్తూంటాడని, టాలీవుడ్ లో అతని పెట్టుబడులు కూడా ఉన్నాయని నట్టి వెల్లడించారు.

ఇన్నాళ్ళూ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇఫ్పుడెందుకు వీటిని బయటపెట్టారన్న ప్రశ్నలకు పోలీసులే నయీంకు తొత్తులుగా, పార్ట్ నర్స్ గా ఉన్నపుడు తనకు రక్షణ ఎవరని నట్టికుమార్ ప్రశ్నించారు. ఒక సీఐ తన తలకు గురిపెట్టి నయీంతో పెట్టుకోవద్దని బెదిరించాడని ఆయనన్నారు.ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు కు కూడా నయీంతో సంబంధాలున్నాయని నట్టికుమార్ సంచలన ఆరోఫణలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వస్తున్న ఓ విద్యుత్ ప్రాజెక్ట్ దందాల వెనక అచ్చెన్నాయుడు-నయీం హస్తముందని ఆయనన్నారు.

తెలుగు చిత్రాల్లో హీరోగా నటించిన ముంబయికి చెందిన సచిన్ జోషికు కూడా నయీంతో సంబంధాలున్నాయని నట్టి ఆరోపించారు. నయీంకు కొంతమంది సినీ పెద్దలు కూడా సహకరించారని నట్టి వాదన.. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయని చెబుతున్నారు.

Leave a Reply