అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేసిన పవన్‌

0
455
Producer's advance amount was given back in Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఎఎం రత్నం నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు నేసన్‌ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుందని, పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. చిత్రం కోసం అంతా సిద్దం చేసుకున్న సమయంలో విడుదలైన ‘కాటమరాయుడు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో రీమేక్‌ జోలికి వెళ్లవద్దని పవన్‌ నిర్ణయించుకున్నాడు. అందుకే రత్నంకు సారీ చెప్పాడు. నేషన్‌ దర్శకత్వంలో నటించలేను అంటూ చెప్పి, నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్‌ మొత్తంను తిరిగి ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మరో మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు పవన్‌ కమిట్‌ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీస్‌ మేకర్స్‌ వారు ఆ సినిమాను నిర్మించబోతున్నారు. ఎఎం రత్నంకు ఎందుకు పవన్‌ హ్యాండ్‌ ఇచ్చాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఆ రీమేక్‌ కాకున్నా మరో సినిమాను అయినా ఆయన నిర్మాణంలో చేస్తాడేమో అని అంతా భావించారు. అయితే ఇక రత్నం బ్యానర్‌లో నటించలేను అని తేల్చుకున్న పవన్‌ తాజాగా అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాడు.

Leave a Reply