అందమే ఆమెకు శత్రువాయే..!

Posted April 21, 2017 at 12:16

producers not giving chances to actress madhubala because of her beauty
నిన్నటి తరం హీరోయిన్స్‌ రీఎంట్రి ఇచ్చి ఆంటీలుగా అక్కలుగా అమ్మలుగా మళ్లీ ఆకట్టుకుంటున్నారు. స్టార్‌ హీరోలకు అమ్మలుగా నిన్నటి తరం స్టార్‌ హీరోయిన్స్‌ అలరిస్తున్న నేపథ్యంలో మరో హీరోయిన్‌ మధుబాల కూడా రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుంది. అప్పట్లో తన అందం మరియు అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు రీ ఎంట్రీతో మరోసారి తన ప్రతిభను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈమెకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కారణం ఆమె అందమే అని తెలుస్తోంది.

ఒక స్టార్‌ హీరోకు తల్లిగా కనిపించాలంటే ఒక మోస్తరు అందంతో పాటు హుందా తనం, పెద్ద మనిషి తరహాలో కనిపించాలి. కాని మధుబాల మాత్రం 40 ఏళ్ల వయస్సులో కూడా అప్పటిలాగే అందంగా ఉండి, ఈమె హీరోలకు తల్లి ఏంటి అనేలా ఉంది. దాంతో ఈమెకు ఆంటీగా లేదా అమ్మగా అవకాశాలు ఇచ్చేందుకు దర్శకులు సాహసించడం లేదు. అమ్మ పాత్రలకు సరిపోదని, హీరోలకు లేదా హీరోయిన్స్‌కు అక్క పాత్రలు అయితే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం హీరోయిన్‌నే డామినేట్‌ చేసేలా మధుబాల అందంగా ఉందని అందుకే ఆమెను తీసుకోవడం ఇబ్బందే అని అంటున్నారు. అందుకే ఆమె అందం వల్లే ఆమెకు అవకాశాలు రావడం లేదట.

SHARE