Saturday, December 3, 2022
HomeEntertainmentCinema Latestటీజర్స్‌తోనే ఉబ్బి తబ్బిబవుతున్న ప్రేక్షకులు

టీజర్స్‌తోనే ఉబ్బి తబ్బిబవుతున్న ప్రేక్షకులు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమాలను ప్రమోషన్‌ చేయడంలో కొత్త కొత్త పద్దతులను టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా విడుదలయ్యే వరకు ఏదో ఒక విధంగా ప్రేక్షకుల్లో సినిమాను ఉంచేలా చూసుకుంటున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఇలా సినిమాకు సంబంధించిన ఏదో ఒక అంశం ప్రేక్షకులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. ఇటీవ టాలీవుడ్‌లో టీజర్స్‌ జోరు మామూలుగా లేదు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగా, నిమిషం లోపు నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చే వీడియోనే టీజర్‌.

తెలుగులో ప్రస్తుతం వస్తున్న ప్రతి సినిమాకు కూడా టీజర్‌ వస్తుంది. ఇటీవల పాటలు విడుదల కాబోతున్న సందర్బంగా ఆడియో టీజర్‌ అని, ఇక ఏదైనా పాట విడుదల చేయబోతున్న సమయంలో ఆ పాట టీజర్‌ అంటూ కూడా విడుదల చేస్తున్నారు. ఇలా టీజర్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచడంలో ఫిల్మ్‌ మేకర్స్‌ సక్సెస్‌ అవుతున్నారు. టీజర్‌లో చూపించేంది నిమిషం లోపే అయినా కూడా ఏదో ఉంది సినిమాలో అనేట్లుగా టీజర్‌ను కట్‌ చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు టీజర్‌ను చూసి సినిమాను చూడాలని కోరుకుంటున్నారు. కొన్ని సినిమాల టీజర్స్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచుతున్నాయి. అయితే కొన్ని టీజర్స్‌ మాత్రం సినిమా స్థాయిని పెంచడంలో విఫలం అవుతున్నాయి.

- Advertisment -
spot_img

Most Popular