అయన అప్పుడే చెప్పారట..కానీ ఎవ్వరు పట్టించుకోలేదు.. ఇప్పుడు అదే జరిగింది

Posted November 9, 2016

professor allan lichtman predicted to trump will become american president
అగ్రరాజ్య ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే జోస్యం చెప్పారు. అయితే అపట్లో ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు సరికదా..అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ఇంతకీ ఎవరాయన ? ఆయనే అమెరికన్ ప్రొఫెసర్‌ అలాన్‌ లిచట్మన్‌. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన వేసిన అంచనా ఎన్నడూ తప్పుకాలేదు. 1984 ఎన్నికల నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారో ఆయన కచ్చితంగా అంచనా వేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మొగ్గు ఉందని సర్వేలు చెప్పినప్పటికీ.. అలాన్‌ మాత్రం ట్రంప్‌ గెలుస్తారని ఘంటాపథంగా తేల్చి చెప్పారు. లిచట్మన్‌ ఏదో ఆషామాషీగా అంచనా వేసి ఈ ఫలితాలను ప్రకటించలేదు రాజకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ ప్రజల మనోభావాలను అంచనా వేసి ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే విజయం సాధిస్తారని అలాన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రంప్‌ ఎందుకు గెలుస్తారో వివరిస్తూ ‘ప్రిడిక్టింగ్‌ ద నెక్ట్స్ ప్రెసిడెంట్‌: ద కీస్‌ టు వైట్‌హౌస్‌ 2016’ పుస్తకాన్ని ప్రచురించారు. అప్పట్లో నమ్మకపోయినా ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఈ అమెరికా ఆక్టోపస్‌ జోస్యం నిజమైందనుకుంటున్నారట అందరూ..

SHARE