చినరాజప్పకు ప్రమోషన్?

0
605
promotion to chinarajappa

Posted [relativedate]

promotion to chinarajappa
చంద్రబాబు కేబినెట్ లో మార్పులుంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం చినరాజప్పకు ప్రమోషన్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్ అంటే ఆయనను కొంపదీసి సీఎం చేస్తారా అని డౌట్ పడకండి. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు పేరు మంత్రిపదవి రేసులో వినిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆయనను మినిస్ట్రీలోకి తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట. పార్టీ అధ్యక్షుడిగా కంటే… మంత్రిగానే ఆయన సేవలను వాడుకోవాలనే యోచనలో ఉన్నారని టాక్.

కళావెంకట్రావును మంత్రివర్గం తీసుకునే ఆలోచన వెనక పలు కారణాలు ఉన్నాయట. కళా వెంకట్రావు ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోస్తా ప్రాంతంలో కాపు ఉద్యమం జోరు మీదుంది. కాబట్టి టీడీపీకి కాపుల్లో మంచి మైలేజ్ తీసుకురావడానికి ఏకంగా పార్టీ అధ్యక్ష పదవిని ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకే కాపు సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం చినరాజప్పకు ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు టాక్.

ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్న చినరాజప్పపై చంద్రబాబుకు మంచి గురి ఉంది. అన్ని వర్గాలను కలుపుకుపోయే వ్యక్తిగా ఆయనకు పేరుంది. పైగా వివాద రహితుడు. ఆయనైతే అన్ని ప్రాంతాల నేతలనూ కలుపుకుపోయే అవకాశముంది. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతే మంచి ప్రయోజనం ఉంటుందని అధినాయకత్వం ఆలోచిస్తోంది. కాబట్టి చినరాజప్పకు ప్రమోషన్ ఖాయమని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

Leave a Reply