నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-35 రాకెట్…

Spread the love

Posted [relativedate]

 pslv-c35 rocket gone space successfullyభూ ఉపరితలంపై వాతావరణం పరిశీలన, తుపాన్లను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానంతో రూపొందిన స్కాట్‌శాట్‌ ఉపగ్రహం పీఎస్‌ఎల్వీ-సీ35 నాలుగో దశ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో నిర్ణయించిన సమయానికి అనుగుణంగానే రాకెట్ ప్రయోగం జరిగింది. స్కాట్‌శాట్‌-1ను పీఎస్‌ఎల్వీ-సీ35 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంలో 3 స్వదేశీ ఉపగ్రహాలు, 5 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది.

ముంబై ఐఐటీకి చెందిన ప్రథమ్‌ ఉపగ్రహం, బెంగళూరు పీఈఎస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పీశాట్‌ ఉపగ్రహం, అల్జీరియాకు చెందిన మూడు ఉపగ్రహాలు, కెనడా, యూఎస్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఈ రాకెట్ ద్వారా నింగిలో ప్రవేశ పెట్టారు. ప్రయోగం ప్రారంభించిన 2.15 గంటల్లో ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here