Posted [relativedate]
పురచ్చితలైవి జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీపై ఇన్నాళ్లుగా వినిపిస్తున్న గుసగుసలు నిజమేనా? మధుమేహంతో బాధపడుతున్న ఆమెకు తప్పుడు మందులు ఇవ్వడం వల్లనే ఆస్పత్రి పాలయ్యారా? ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్ఖాదత తన సహచరులకు, యాజమాన్యానికి పంపిన ఈమెయిల్ ఈ ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానం ఇస్తోంది. సెప్టెంబరు 22న జయలలితను తమ వద్దకు తీసుకొచ్చేటప్పటికే.. ఆమెకు డయాబెటి్‌సకు(చక్కెరవ్యాధి) సంబంధించి ఇవ్వాల్సిన ఔషధాలు కాకుండా వేరే ఔషధాలు ఇస్తున్నట్టు అపోలో యాజమాన్యం తనతో చెప్పినట్టు బర్ఖాదత ఆ మెయిల్లో(ఆఫ్ ద రికార్డుగా పేర్కొంటూ) వివరించారు. మామూలుగా అయితే ఈ వివరాలు బయటికి వచ్చేవి కావేమోగానీ.. ఇటీవలే బర్ఖాదత ఈమెయిల్, ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసిన హ్యాకర్ల గ్రూపు బర్ఖాదత ఇన్‌బాక్స్‌లోని ఈ మెయిల్‌ను బయటపెట్టింది. కాగా.. జయ చికిత్సపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా విపక్షనేత, డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్, పట్టాళి మక్కళ్ కట్చి(పీఎంకే) అధినేత ఎస్.రాందాస్ డిమాండ్ చేశారు. అలాగే.. ‘అమ్మ’ మరణం వెనుక ఉన్న నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డికి, ఎండీ ప్రీతారెడ్డికి, జయ నెచ్చెలి శశికళకు నిజనిర్దారణ పరీక్షలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలైంది.
ప్రముఖ సామాజిక సేవకుడు ట్రాఫిక్ రామస్వామి కూడా.. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. మరోవైపు.. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలుసుకుని.. జయ మరణంపై సీబీఐ వి చారణ కోరారు. మరోవైపు.. ఐదేళ్లు సభ్యత్వం ఉన్నవారే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులన్న నిబంధనలను అవసరమైతే శశికళ కోసం మారుస్తామని ఆ పార్టీ నేత పొన్నయ్యన ప్రకటించారు.