మూడో రోజు రెండు సెంచరీలు…

0
345
pujara murali vijay centuries in india vs england first test match

Posted [relativedate]

pujara murali vijay centuries in india vs england first test matchఇంగ్లాడుతో తొలి టెస్టులో భారత జట్టు మూడు రోజుసత్తా చాటింది. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 218 పరుగులు చేధించాల్సివుంది. భారత బ్యాట్స్‌మన్స్ లో ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్ లు మూడో రోజు శతకాలతో అదరగొట్టారు.

మూడోరోజు ముగుస్తుందనగా విజయ్ వెనుదిరగడం భారత్ కు గట్టి దెబ్బే పుజారా 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగగా మరికొద్దిసేపు క్రీజులో నిలిచిన విజయ్(126) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అమిత్ మిశ్రా కేవలం రెండు బంతులే ఎదుర్కొని వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, సువర్ట్ బ్రాడ్, అదిల్ రషీద్, జాఫర్ అన్సారీలు తలో వికెట్‌ పడగొట్టారు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గౌతమ్ గంభీర్ ఎల్ బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

Leave a Reply