పాక్ నటులపై నిషేదం సరైనదే : పవర్ స్టార్

Posted October 15, 2016

 puneeth raj puth not support pakistan actors

యురి ఉగ్రవాద ఘటన నేపథ్యంలో.. పాక్ నటీనటులు భారతదేశాన్ని విడిచి వెళ్లాలని ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. పాక్ నటుల నిషేదంపై బాలీవుడ్ హీటెక్కింది. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్..వంటి వారు పాక్ నటులకి అండగా నివడం తీవ్ర చర్చకు తెరలేచింది. నానా పటేకర్.. లాంటి నటులు ‘దేశం తరువాతే ఎవరైనా’ అంటూ సల్మాన్, కరణ్ వాఖ్యాలని తీవ్రంగా ఖడించారు. ఇప్పటికీ కూడా పాక్ నటుల నిషేదంపై బాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు కూడా దక్షణాది నటులు పెద్దగా స్పంచింది లేదు. తాజాగా, పాక్ నటుల నిషేదంపై పవర్ స్టార్ స్పందించారు. అలాగని.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అనుకునేరూ. ఈయన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ పుత్. ‘కళ కంటే దేశం చాలా గొప్పది.. ముందు మనమందరం భారతీయులం ఆ తరువాతే కళాకారులం.. పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదే’ అంటూ కామెంట్ చేశాడు. మరి.. పవర్ స్టార్ కామెంట్స్ ఎంతమంది దక్షణాది నటులు ఏకీభవిస్తారన్నది చూడాలి.

SHARE