పంజాబ్ బల్బుకి ఢిల్లీ స్విచ్ ..

0
501
Panjab bulb Delhi switch

punjab bulb delhi switch

ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బల్బు వెలుగుతుందని ఓ సినిమా డైలాగ్.దాన్ని ఫాలో అయిపోతున్నారు ప్రధాని మోడీ ,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇద్దరికీ ఇప్పుడు పంజాబ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. అక్కడ పట్టు కోసం తాము ఉంటున్న ఢిల్లీలోనే పావులు కదుపుతున్నారు.సర్వే లు చూస్తే మోడీకి పంజాబ్ లో కూడా కేజ్రీవాల్ చేతిలో పరాభవం తప్పదంటున్నాయి. అది నిజం కాకూడదని మోడీ ఢిల్లీ వేదికగా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

చీపురు పార్టీ కున్న క్లీన్ ఇమేజ్ తుడిపేయడానికి మోడీ వడివడిగా అడుగులేస్తున్నారు. అందులో భాగమే ఆప్ ఎమ్మెల్యేలు 12 మంది వివిధ కేసుల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఇవి తప్పుడు కేసులు కాదన్నది ఎంత నిజమో… పంజాబ్ టార్గెట్ గా ఈ కేసుల్ని సాధించి శోధిస్తున్నారనేది అంతే నిజం. వీటి నుంచి దృష్టి మరల్చడానికి కేజ్రీవాల్ కూడా ప్రధాని మోడీ ఏకంగా తనను చంపేయిస్తారనే దాకా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి పంజాబ్ లో వెలుగుల కోసం ఈ నేతలు ఢిల్లీ లో స్విచ్ వేస్తున్నారు.ఏ లైట్ వెలుగుతుందో.. ఏది మాడుతుందో చూద్దాం ..

Leave a Reply