ఆ ముగ్గురికి చిన్నమ్మ షాక్..

0
473
purandeswari says i am not joining ysrcp and tdp

Posted [relativedate]

purandeswari says i am not joining ysrcp and tdp
చిన్నమ్మ…కొన్నాళ్లుగా ఈ పేరు చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి.ముందుగా తమిళ రాజకీయాలు,ఆపై తెలుగు రాజకీయాల్లో చిన్నమ్మల చుట్టూనే మీడియా కధల అల్లిక ఎక్కువైంది. ఆ అల్లిక కొందరికి నచ్చింది.ఇంకొందరికి కోపం తెప్పించింది.శశికళ జైల్లో కూర్చున్న కొన్నాళ్ళకి ఆమె గురించి కధనాలు తగ్గుతున్నాయి అనుకునేంతలో తెలుగు రాజకీయాల్లో చిన్నమ్మ పురందేశ్వరి పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది.దానికి సాక్ష్యంగా రోజా,పురందేశ్వరి కలిసి వున్న ఫోటోని చూపించారు.అది ఎప్పటిది ఏమిటి అన్నది క్లారిటీ లేకపోయినా వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఈ ఫోటోకి,అందుకు సంబంధించిన కథనానికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చింది.దీంతో టీడీపీ వర్గాలు,ఆ పార్టీ అనుకూల మీడియా అప్రమత్తమయ్యాయి.పురందేశ్వరిని తమ పార్టీలోకి ఆహ్వానించే పనులు మొదలైనట్టు కొందరు నేతలు ఫీలర్లు వదిలారు.దీంతో ఆమె టీడీపీ వైపు కూడా చూస్తున్నారని కూడా ప్రచారం సాగింది.

ఏ ఆధారం,సాక్ష్యం లేకుండా ఇలాంటి ప్రచారం జరగడం మీద దగ్గుబాటి పురందేశ్వరి ఫీల్ అయ్యారు.ఈ పుకార్లకు తెర దించకపోతే జరిగే నష్టాన్ని కూడా ఆమె గ్రహించారు.అందుకే ఇంకెప్పుడు ఈ తరహా ప్రచారం జరక్కుండా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.ఎన్టీఆర్,దగ్గుబాటి విలువల్ని కాపాడుతూ రాజకీయాలు చేస్తానని చెప్పిన ఆమె …తాజా ప్రచారం గురించి సోషల్ మీడియా తీరుని తప్పుబట్టారు.ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ లోకి వెళ్లే ఆలోచన లేదని ….ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు.టీడీపీ గురించి కూడా పుకార్లు రావడంతో ఆ ఆలోచన కూడా లేదని తేల్చేశారు.బీజేపీ లోనే కొనసాగుతానని పురందేశ్వరి వివరించారు. ఆమె వివరణతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ,టీడీపీ లతో పాటు ఇష్టారాజ్యంగా రాసేసిన సోషల్ మీడియాకి కూడా షాక్ తగిలింది.ఇలా ఒక్క వివరణతో ఆమె ముగ్గురికి చెక్ పెట్టారు.

Leave a Reply