చిన్నమ్మ మీద అమిత్ షా ఆగ్రహం..?

0
370
purandeswari wrote letter to amit shah about on tdp cabinet expansion

Posted [relativedate]

purandeswari wrote letter to amit shah about on tdp cabinet expansionఎన్టీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన పురంధేశ్వరి.. నాన్న ఛరిష్మా, సొంత టాలెంట్ తో బాగానే పైకొచ్చారు. కానీ ఆదరించి కేంద్రమంత్రిని చేసిన కాంగ్రెస్ ను వదిలేసి.. 2014లో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్నుంచి పదవుల కోసం కొంగ జపం చేస్తూన్నా.. ఏదీ కలిసిరాలేదు. బీజేపీకి టీడీపీతో పొత్తు ఉన్నంతకాలం.. తనకు ఏ పదవి వచ్చినా చంద్రబాబు అడ్డుకుంటారని డిసైడైన పురంధేశ్వరి ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు. ఏపీలో ఎలాగో బీజేపీకి భవిష్యత్తు లేదని, వైసీపీలో చేరితే విజయవాడ ఎంపీ సీటుకు పోటీ చేయొచ్చని ఆశపడుతున్నారు.

గోడదూకడానికి దాదాపు ఫిక్సైన చిన్నమ్మ.. అధిష్ఠానానికి ఆగ్రహం కలిగించేలా ఏదో ఓ పని చేయాలని భావించారు. అందుకే పార్టీ ఫిరాయించినవారితో చంద్రబాబు క్యాబినెట్ విస్తరణ అనైతికమని అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేసి కావల్సినంత రచ్చ చేశారు. ఇప్పటికే గోవా, మణిపూర్లో ఫిరాయింపుదార్లతో సర్కారు నడుస్తోందని విపక్షాలు ఎద్దేవా చేస్తుంటే.. పురంధేశ్వరి లేఖ బీజేపీకి పుండు మీద కారం చల్లినట్లైంది. అసలు పురంధేశ్వరి లేఖ ఎందుకు రాశారా అని తనదైన శైలిలో ఆరా తీసిన అమిత్ షా అసలు విషయం తెలుసుకుని సీరియస్ అయ్యారట.

పార్టీ మారాలంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముందని, పురంధేశ్వరి వల్ల తమకు ఒరిగిందేముందని కూడా సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారట. రాజకీయాల్ని సిద్ధాంతపరంగా కాకుండా.. చంద్రబాబు మీద వ్యతిరేకతతో చేస్తే ఏం ఉపయోగమనేది కూడా బీజేపీ అధిష్ఠానం భావన. ఇప్పటికే పీకల్లోతు కేసుల్లో మునిగిన జగన్ పంచన చేరి.. ఏం సాధిస్తారని పురంధేశ్వరిని సొంత అనుచరులు కూడా నిలదీస్తున్నారట. ఎన్టీఆర్ కూతురు కాంగ్రెస్ లో చేరితేనే వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు జగన్ తో కలిస్తే పడే ఓట్లు కూడా పడవని ఆవేదన చెందుతున్నారట. ఎన్టీఆర్ కుమార్తెగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి కానీ.. పదవుల కోసం వెంపర్లాడటమేంటని పురంధేశ్వరి శ్రేయోభిలాషులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply