పూరీ సినిమాలో మరో కొత్త పోరి..

  Posted March 27, 2017puri jagannadh introduced new heroine for balakrishna movie

పూరీ జగన్నాధ్ సినిమా వస్తోందంటేనే  కొత్త హీరోయిన్స్ టాలీవుడ్ కి  పరిచయం అవుతారని చెప్పుకోవచ్చు.  ఎప్పటి నుండో తన సినిమాల్లో దాదాపు కొత్త హీరోయిన్స్ కే  అవకాశం కల్పిస్తున్నాడు పూరీ. బద్రి సినిమాతో  రేణూ దేశాయ్, అమీషా పటేల్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో తనూరాయ్ ని, సూపర్ తో ఆయేషా టకియాని, ఇడియట్ తో రక్షితని, చిరుతతో నేహాశర్మని, ఏక్ నిరంజన్ లో కంగనా రనౌత్ ని.. ఇలా చాలామంది కొత్త హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు పూరీ. వీళ్లలో కొంతమంది స్టార్ హీరోయిన్లుగా స్టార్ డమ్ ని సంపాదించుకుంటే మరి కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయ్యారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత దర్శకుల్లో కొత్త హీరోయిన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే దర్శకుడు అంటే టక్కున పూరీ పేరే వినిపిస్తుంది.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా చేసే సినిమాలో కూడా కొత్త హీరోయిన్ నే  సెలెక్ట్ చేసేశాడట పూరీ. బాలకృష్ణ 101వ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా ముగ్గురినీ కొత్త హీరోయిన్స్ అయితే బాగుంటుందని పూరీ భావించాడట. అయితే నిర్మాతలు కొత్త హీరోయిన్స్ కి నో చెప్పడంతో ఒక హీరోయిన్ గా సీనియర్ కధానాయిక అయిన శ్రియని తీసుకోనున్నాడని సమాచారం. అలానే  సన్నీలియోన్ ఇందులో ఓ ఐటెం సాంగ్ చేస్తుండగా మరో హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేశాడట పూరీ. ఇటీవల సినిమాలోని బాల‌య్య ఇంట‌ర్వెల్ ఫైట్‌ని  పూర్తి చేసిన పూరి త్వరలోనే కొత్త పోరిని రంగంలోకి దింపనున్నాడట. సో.. ఆ కొత్త హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చెయ్యకతప్పదు.

SHARE