రఫ్ అండ్ టఫ్ గా బాలయ్య..

Posted March 27, 2017

puri jagannadh says about balakrishna roleగౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఫ్యాక్షన్, యాక్షన్ అంటూ భారీ ఫైట్స్ ఉన్న సినిమాల్లో నటించాడు బాలయ్య. అయితే ఈ తాజా సినిమాలో మాత్రం గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో నటించనున్నాడని సమాచారం.

నిజానికి ఈ సినిమాను పూరీ.. మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సిఉంది. దీంతో తమ అభిమాన హీరో బాలయ్యని ఈ సినిమాలో పూరీ ఎలా చూపిస్తాడోనని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో యూనిట్ సభ్యులు బాలయ్య గెటప్ గురించి కాస్త హింట్ ఇచ్చారు. రఫ్ అండ్ టఫ్ గా బాలయ్య మరింత యంగ్ గా కనిపించనున్నాడని, గ్యాంగ్ స్టర్ తరహాలో ఆయన పాత్ర వుంటుందని చెబుతున్నారు.  పుల్ స్టాప్ లు,  కామాలు లేకుండా బాలయ్య చెప్పే పంచ్ డైలాగులు ఈ సినిమాలో ఏమీ ఉండవనీ,  చాలా రియలిస్టిక్ గా ఆయన పాత్ర వుంటుందని అంటున్నారు.  సినిమా  మొదటి షెడ్యూల్ పూర్తి చేశామని, వచ్చేనెల 5వ తేదీ నుండి సెంకడ్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నామని తెలిపారు. అభిమానులు బాలయ్య  నుంచి కొత్తగా కోరుకునే అంశాలు తమ సినిమాలో చూపిస్తున్నామన్నారు. మరి చిరు వదులుకున్న అవకాశంతో బాలయ్య ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

SHARE