పూరి టార్గెట్ లో కుర్ర హీరోలు..!

Posted November 4, 2016

pr1416పవర్ ఫుల్ డైలాగులతో, డేరింగ్ హీరో మేనరిజంతో డైరెక్ట్ చేసే పూరి ఈ మధ్య కాస్త ట్రాక్ తప్పినట్టు కనిపిస్తున్నాడు. టెంపర్ తర్వాత వచ్చిన జ్యోతిలక్ష్మి, లోఫర్ ఫ్లాప్ అవ్వగా కళ్యాణ్ రామ్ తో తీసిన ఇజం కూడా అదే లిస్ట్ లో చేరిపోయేలా ఉంది. లెక్కకు మించి బడ్జెట్ అవడం వల్ల సినిమా ఓవరాల్ గా లాస్ తెచ్చి పెడుతుందని అంటున్నారు. అయితే ఈ టైంలో పూరి మాత్రం తన తర్వాత సినిమా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేందుకు బ్యాంకాక్ చెక్కేశాడు.

అంతేకాదు ఈసారి పూరి టార్గెట్ కుర్ర హీరోలని తెలుస్తుంది. రామ్, నాగ శౌర్య లాంటి యువ హీరోలకు సరిపడే కథ ఒకటి సిద్ధం చేస్తున్నాడట. ఈసారి పెన్ను మరింత పదును పెట్టి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. మినిమం గ్యారెంటీ డైరక్టర్ దగ్గర నుండి బ్లాక్ బస్టర్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న పూరి ప్రస్తుతం ఫ్లాప్ డైరక్టర్ అనే ఇమేజ్ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే హిట్ కొట్టేదాకా నిద్ర పోకుండా శ్రమిస్తున్నాడు. కథ పూర్తి చేసుకుని రాగానే షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. కుదిరితే రామ్ లేదంటే నాగ శౌర్యతో చర్చలు జరిపి స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేస్తాడట పూరి. మరి ఈ సినిమా అయినా పూరికి హిట్ ఇస్తుందేమో చూడాలి.

SHARE