పుష్కర సిత్రం..సినీ అమరులకు పిండం..

 pushkara cinema cine legend death people rice offering
ఓ తెల్లటి గుడ్డముక్క వెండితెర అయ్యింది..ఆ తెర పై కదిలే బొమ్మలు మెరిసే తారలయ్యాయి …ఆ తారల తళుకుబెళుకులు,విన్యాసాలు ప్రేక్షకుల మనసుపొరల్లోకి వెళ్లి నవ్వించాయి…కవ్వించాయి…ఏడిపించాయి…ఏదేదో చేసేసి మదినిండా ఉండిపోయాయి.ఇక ఆ తారలు అభిమానుల గుండెల్లో కొలువుదీరిన దేవుళ్లయ్యారు.ఈ వెండితెర దేవుళ్ళు భౌతికంగామన మధ్య లేకపోయినా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో అమరులుగానే మిగిలారు .
పుష్కర సిత్రంగా అలనాటి వెండితెర వీరులకు ఓ అభిమాని ఏమి చేశారో తెలుసా ?..

దివి నుంచి భువికేగిన వెండితెర ఇలవేల్పుల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ…వారి ఆత్మ శాంతి కోసం ఘనంగా పిండప్రదానం చేశారు.ఆ అభిమాని పేరు పొత్తూరి రంగారావు.కళా దర్బార్ కల్చరల్ అకాడమీ తరపున మహా సంగమం ఘాట్ లో మొత్తం 24 మంది నటీనటులకు పిండప్రదానం చేశారు.ఎన్టీఆర్ ,అక్కినేని ,ఎస్.వి.రంగారావు,ఘంటసాల ,మొదలుకొని రాజేష్ ఖన్నా ,ఉదయ్ కిరణ్ వరకు ఈ జాబితాలో వున్నారు.ఈ ఘటన పైకి కాసింత సిత్రం అనిపించినా దేశంలోవెండితెర చేరిన ఎత్తుకు …అభిమానపు లోతుకు సజీవ సాక్ష్యం ..cine death

SHARE