పుష్కర హారతి పనుల్లో బోయపాటి ..

pushkara harathi boyapati

విజయవాడలోని ఫెర్రీ పుష్కర ఘాట్ ని   బోయపాటి శ్రీను పరిశీలించారు. పుష్కరహారతిపై పలు సూచనలు చేశారు..పుష్కరహారతి ని బోయపాటి దర్శకత్వంలోనే ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడికి వచ్చిన మంత్రులు నారాయణ, దేవినేని ఉమాలకు పుష్కరహారతిపై విశ్లేషించారు..హారతి ఎలా ఉంటుంది..జనాలు ఎలా వస్తారన్నదానిపై మంత్రులకు వివరించినట్లు సమాచారం..పుష్కరఘాట్ల నిర్మాణం తుదిదశకు చేరుకున్నాయని ఉమా వ్యాఖ్యానించారు..భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం పుష్కరనగర్ లు ఏర్పాటు చేసామన్నారు.. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు అంతర్గతంగా టిడిపినేతలు చెప్తున్నారు..

SHARE