Posted [relativedate]
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే అమ్మ రాజకీయాలకు నైతికంగా వారసులు.కానీ తమిళనాట ప్రభుత్వం నడుపుతున్న శశికళ వర్గానికి జయ కి కంచుకోట లాంటి ఆర్కే నగర్ లో చేదు అనుభవం ఎదురు కాబోతోందట.పుదియ తలమురై అనే తమిళ్ ఛానల్ అక్కడ జరిపిన సర్వే లో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి.
పన్నీర్ సెల్వం బలపరిచిన మధుసూదన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలుస్తారట.శశికళ నమ్మిన బంటు టీటీవీ దినకరన్ కనీసం రెండో స్థానంలో కూడా వుండరట.ప్రధాన ప్రతిపక్షం డీఎంకే రెండో స్థానాన్ని,దినకరన్ మూడో స్థానాన్ని మాత్రమే పొందగలరట.నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి,ఇక ఇదో స్థానంలో జయ మేనకోడలు దీప జయకుమార్ నిలిచే అవకాశం ఉందని ఆ టీవీ సర్వే ఫలితాలు వెల్లడించగానే పళనిస్వామి స్వామి సర్కార్ ఆ టీవీ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చే చర్యలు చేపట్టింది.జయ కంచుకోట లో ఆమె వారసులమని చెప్పుకుంటున్న శశికళ,దీప జయకుమార్ నిజంగానే దెబ్బ తిని మాజీ సీఎం పన్నీర్ సెల్వం నిలబెట్టిన అభ్యర్థి గెలిస్తే అది కేవలం ఆ నియోజకవర్గంతో ఆగదు. మొత్తం తమిళ్ రాజకీయాల్ని మళ్లీ సెల్వం వైపు తిప్పుతుంది.