భాగ్యనగర్ సింధు..

0
572

   pv sindhu badminton playing history hyderabad  ghmc academyహైదరాబాద్ మున్సిప ల్‌కార్పొరేషన్ నుంచి క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ సింధు అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత ఒలంపిక్ పతకం సాధించింది. 2005లో పదోఏట అమీర్‌పేట ధరంకరం రోడ్‌లోని గురు గోవింద్ సింగ్ స్టేయంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో చేరిన పీవీ సిందు వరుసగా అండర్ 12, అండర్-15 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. దాదాపు మూడేళ్లపాటు జీహెచ్ ఎంసీలో ప్రాథమిక స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ లో శిక్షణపొందిన సింధు తర్వాత బ్యాడ్మింటన్ అకామి లో చేరింది. అయినప్పటికీ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి క్రీడా పోటీలు, ఏటా నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్‌క్యాంపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విధిగా హాజరవుతోంది.

ముఖ్యంగా గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేయడంతోపాటు కమిషనర్ డాక్టర్ బి.జనార్థన్ రెడ్డితో బ్యాడ్మింటన్ కూడా ఆడింది. దీనితో పాటు హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ ఎత్తున నిర్వ హించిన హరితహారం కార్యక్రమం సంద ర్భంగా జీహె చ్ఎంసీ అధికారులు కోరి విధంగా నార్త్‌జోన్‌లో మొక్కలు నాటడం ద్వారా నగర ప్రజల్లో స్పూర్తిని నింపాయి.

ఒలంపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ పోటీలలో ఫైనల్‌కు చేరు కున్న పీవీ సింధు జీహెచ్ఎంసీతోనే తన కేరీర్‌ను ప్రారం భించడం జీహెచ్ఎంసీ గర్వకారణమని మేయర్ బొంతురా మ్మోహన్ తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కోచింగ్ క్యాం పుల ద్వారా సింధులాంటి క్రాడాకారులను సిద్ధం చేస్తామని తెలిపారు.
అవార్డుల గని జీహెచ్ఎంసీ

జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలు, కోచింగ్, సమ్మర్ కోచింగ్ క్యాంపుల ద్వారా 50మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను జీహె చ్ఎంసీ దేశానికి అందించింది. ఇప్పటి వరకు 8మంది అర్జున అవార్డులు, 34మంది అంతర్జాతీయ స్థాయి క్రీడా కారులను అందించింది. అర్జున అవార్డుల గ్రహితల్లో బాక్సింగ్ నుంచి డెన్నీ స్వామీ, జయరామ్, వాలీబాల్ రవి కాంత్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌నుంచి చేతన్ ఆనంద్, పద్మశ్రీ సారిఫ్, క్రికెట్ నుంచి గౌర్‌సుల్తానా, చపక్‌తక్రా నుంచి సమీ నాబేగం, బాస్కెట్‌బాల్ నుంచి మహ్మద్ రిజ్వాల్, బి.హరికృష్ణప్రసాద్, ఫుట్‌బాల్ నుంచి షబ్బీర్ అలీల తోపాటు పలు జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను సమ్మర్ కోచింగ్ క్యాంపుల ద్వారా నగరంలోని క్రీడాకారులకు శిక్షణను అందించింది. ఈ పోటీల్లో పాల్గొన్న వృద్ద క్రీడాకారులకు నెలకు రూ.10 వేల నుంచి 7,500 వరకు ఆర్థిక సహాయం అందించింది.

Leave a Reply