సింధుకోసం నెటిజన్లు..

0
600

 pv sindhu first place google searching peoplesభారతదేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో ఏ అంశం గురించి సెర్చ్ చేశారో తెలుసా? పివి సింధు గురించి. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో సింధు ఆడుతుండడంతో ఆమె గురించిన వివరాలు తెలుసుకోడానికి ఎక్కువగా ఆమె పేరు సెర్చ్ చేశారు.ఆ తరువాతి స్థానంలో ఇప్పటికే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ను వెతికారు. ప్రపంచ నంబర్ 6 ర్యాంకర్ నొజొమి ఒకుహరాను ఓడించి ఫైనల్స్‌కు చేరు కున్న పివి సింధు భారతదేశంలో అతి ఎక్కువగా సెర్చ్ అయిన అథ్లెట్ సింధు యేనని గూగుల్ సంస్థ తెలిపింది.

ఆ తరువాత వరుసగా సాక్షి మాలిక్, కిదాంబి శ్రీకాంత్, దీపా కర్మాకర్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, వినేష్ ఫోగట్, లలితా బాబర్, వికాస్ యాదవ్, నర్సింగ్ యాదవ్ నిలిచారు. భారతీయులు ఎక్కువగా బ్యాడ్మింటన్ గురించి, ఆ తరువాత రెజ్లింగ్ గురించి సెర్చ్ చేశారట.ఒలింపి క్స్‌లో మన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శన తరువ్వాత ఆ అంశం గురించి కూడా బాగానే వెతికారంటున్నారు.

గత వారం రోజుల్లో ఒలింపిక్స్ గురించి ఎక్కువగా వెతుకుతున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంది. కేవలం మనవారి గురించే కాదు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ గురించి కూడా వివరాలు తెలుసుకోవడానికి భారతీయులు ప్రయత్నించారు.ఇక విదేశీ క్రీడాకారుల విషయానికి వస్తే, బోల్ట్ తరువాత శ్రీకాంత్‌ను ఓడించిన చైనా షట్లర్ లిన్ డాన్, సింధు చేతిలో ఓడిన ఒకుహరా, బంగారు చేప మైఖేల్ ఫెల్ప్స్, చైనా షట్లర్ వాంగ్ యిహాన్, తదితరుల గురించి భారతీయులు బాగానే గూగుల్‌ను అడిగినట్లు తేలింది. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్య రాష్ట్రాల వారికి ఒలింపిక్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు ఈ సెర్చ్‌లో తేలింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్.. ఈ ఆరు రాష్ట్రాలలో నెటిజన్లు రియో గేమ్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.

Leave a Reply