ఒలింపిక్స్ బాడ్మింటన్ ఫైనల్లో తెలుగుతేజం ..

 pv sindhu going final rio olympics badmintonరియోడీ జెనీరోలో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం పివి సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. గురువారం సాయంత్రం జరిగిన సెమీ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన నజోమీ ఓకుహారాపై అద్భుత విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. 
 సెమీస్‌లో ప్రపంచ 10వ ర్యాంక్‌ సింధు, తన లక్కీ పసుపురంగు డ్రస్‌నే ధరించి వరుస గేమ్‌ల్లో 21-19, 21-10 తేడాతో జపాన్‌కు చెందిన ఆరోర్యాంక్‌ నజోమి ఒకుహరాను కేవలం 49 నిమిషాల్లో చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్ధితో తలపడిన నాలుగు పోరుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలుచుకున్న సింధు, రియో ఒలింపిక్స్‌ సెమీస్‌లో మాత్రం అమోఘంగా రాణించి సూపర్‌ విజయాన్ని అందుకుంది. 
సహజంగా ఎత్తుగా ఉండే సిందు, ప్రత్యర్ధిని దాదాపు కోర్టు చుట్టూ పరుగులు పెట్టించింది. చక్కటి కోర్టు ర్యాలీలు, డ్రాప్‌షాట్లతో అలరిస్తూ ఆడింది. ఒక దశలో 12-8 ఆధిక్యంతో ఉన్న సింధుకు ఒకుహరా నియంత్రించ గలిగింది. ఒకటి రెండు బాడీలైన్‌ స్మాష్‌లతో ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. 
దేశానికి పతకం ఖాయం చేసిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పీవీ సింధును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ లతో పాటు, ఇతర రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. సింధు దేశం గర్వించేలా చేసిందని అంతా కితాబునిస్తున్నారు. ఇదే స్పూర్తిని కొనసాగించి, స్వర్ణం సాధించాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.
SHARE