సింధు ..రజత విజేత ..

0
595

pvభారత బ్యాడ్మింటన్ చరిత్రలో తెలుగింటి ఆడపడుచు పీ.వీ సింధూ సువర్ణాక్షరాలు లిఖించింది. ఎవరీకి అందని ఘనతను సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో రజత పతకం కైవసం చేసుకుంది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.

హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి ఓడింది.

ఫస్ట్ గేమ్ లో వెనకబడ్డ సింధూ అనూహ్యంగా పుంజుకుంది. అద్భుతమై స్మాష్ లతో ప్రత్యర్ధిని ముప్పతిప్పలు పెట్టి 21-19తో గేమ్ సొంతం చేసుకుంది. సెకండ్ గేమ్ లో సింధూ తీవ్రంగా పోరాడినా కరోలినా మారిన్  అద్భుతంగా పుంజుకుంది. దీంతో 21-12 గేమ్ కరోలినా సొంతమైంది. మూడో గేమ్ లో హోరాహోరీ పోరు జరిగినా కీలక దశలో సింధూ ఒత్తిడికి లోనైంది. దీంతో కరోలిన మ్యాచ్ ను స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

మ్యాచ్ లో సింధు ఓడినా ఆమె పోరాట పటిమ అందర్నీ ఆకట్టుకుంది. క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత ఆ స్థాయిలో మ్యాచ్ కు పాపులారిటీ వచ్చింది. సింధుకి యావత్ దేశం మద్దతుగా నిలిచింది.

Leave a Reply