నమ్మకమే నడిపించింది-సింధు

 pv sindhu said believe my confidenceకోచ్‌ గోపీచంద్‌, తల్లిదండ్రులు, భారతదేశ ప్రజల ప్రోత్సాహంతోనే తాను రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించగలిగానని పీవీ సింధు అన్నారు. గచ్చిబౌలి మైదానంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో సింధు పాల్గొని మాట్లాడారు. తొలిసారి ఒలింపిక్స్‌ బరిలో దిగిన తాను పతకం తెస్తానని అనుకోలేదని… కానీ దేశం తనపై పెట్టుకున్న నమ్మకమే తనను నడిపించిందన్నారు. తనను అభిమానించి ప్రోత్సహించిన అందరికీ సింధు ధన్యవాదాలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో మున్ముందు మరిన్ని పతకాలు సాధిస్తానని సింధు దీమా వ్యక్తం చేశారు.రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుపొందిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్‌కు కనీవినీ ఎరుగని రీతిలో సన్మానం లభించింది.

హైదరాబాద్‌కు చేరుకున్న సింధు, గోపీచంద్‌లకు గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింధుకు, గోపీచంద్‌కు డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సింధును, గోపీచంద్‌ను ప్రశంసించారు. రియో స్టార్ పీవీ సింధు సన్మాన కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రి కేటీఆర్, మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

దేశ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సింధు, సాక్షి మాలిక్‌ దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. సింధు ఫైనల్లో పోటీ పడుతున్న సమయంలో దేశమంతా ఒక్కటై ఆ మ్యాచ్‌ను వీక్షించిందని గుర్తుచేశారు. సింధు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ తీసుకురాకపోయినా.. దేశానికి ఆమే ఒక బంగారమని కొనియాడారు. సింధు వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన సింధు సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఒలింపిక్స్‌లో సింధు, సాక్షి మాలిక్ దేశ గౌరవాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. దేశం గర్వించే పుత్రికగా సింధు నిలిచిందని కొనియాడారు. ఎన్నో త్యాగాల తర్వాతనే ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు.

భారత్ నుంచి సింధు లాంటి మరెంతో మంది ఛాంపియన్లు రావాలన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ అనేక కార్యక్రమాలు, పాలసీలతో దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తాం. ప్రధాని మోడీ బేటీ బచావో.. బేటీ పడావో అని నినదించారు. కానీ ఈ రోజు ఒలింపిక్స్ జరిగిన తర్వాత చూస్తే ఆ బేటీలిద్దరూ ఒక సింధు, ఒక సాక్షి మాలిక్ మొత్తం భారతదేశాన్ని బచాయించిన మాట వాస్తవమన్నారు. ఈ ఇద్దరమ్మాయిలు ఈ రోజు భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచం ముందు నిలబెట్టారని ప్రశంసించారు.సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర గౌరవాన్ని పీవీ సింధు నిలబెట్టిందన్నారు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడిన సింధును అభిమానిస్తున్నానని తెలిపారు. సింధు రాబోయే క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకొస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుంటారని వెల్లడించారు.

రియో ఒలింపిక్స్‌లో గెలిచి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన పీవీ సింధును సత్కరించడం తనకెంతో సంతోషంగా ఉందని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ముందుంటుందని వెల్లడించారు.విశ్వక్రీడా వేదిక రియో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పీవీ సింధుకు భాగ్యనగరంలో అపూర్వ స్వాగతం లభించింది. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడ సింధూతోపాటు ఆమె కోచ్ గోపీచంద్‌కు కుటుంబ సభ్యులు, మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకు విజయోత్సవ ర్యాలీగా చేరుకున్నారుసింధు వెళ్లే మార్గంలో దారి పొడవునా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలు ఊపుతూ సింధు వెల్‌కమ్ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్, రాజేంద్రనగర్, ఆరంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, టోలీచౌక్ మీదుగా గచ్చిబౌలీ వరకు ఊరేగింపు చేరుకుంది.

SHARE