వైసీపీ బిల్లు కట్టేది పీవీపీ ?బదులుగా ఎంపీ టికెట్?

  pvp pay prashant kishor bill because ysrcp party mp ticket
పొట్లూరి వరప్రసాద్ ..వై.ఎస్ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు..జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించిన కేసులోనూ వున్నారు.ఆ తరువాత అయన పవన్ కి దగ్గరయ్యారు.అయన అండతో 2014 లో విజయవాడ లోక్ సభకి పోటీ చేయాలని విశ్వప్రయత్నం చేశారు.కానీ విఫలమయ్యారు. పవన్ వ్యవహారశైలిపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రస్తుతం సినీ నిర్మాణంలో బిజీ గా వున్నారు.అయితే రాజాకీయాలపై అయన ఆసక్తి అలాగే ఉందంట. 2019 లోక్ సభకి పోటీ చేయడానికి అయన మళ్లీ వైసీపీ ని ఆశ్రయించబోతున్నట్టు సమాచారం.అయితే వ్యాపారవేత్త కాబట్టి జగన్ కి దగ్గరయ్యేందుకు అయన ఓ ప్లాన్ తో ముందుకొచ్చారట.అదేంటంటే..

2014 లో మోడీ విజయం లో కీలక పాత్ర పోషించిన ఎలక్షన్ స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిషోర్..ప్రస్తుతం కాంగ్రెస్ ఫేట్ మార్చే పనిలో వున్నారు.ఈ మధ్యలో బీహార్ లో నితీష్ గెలుపుకి కూడా ప్రశాంత్ ప్లాన్స్ పనిచేశాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వైసీపీ కి ప్రశాంత్ సేవలు అందించేందుకు పీవీపీ చొరవ తీసుకున్నట్టు సమాచారం. ప్రశాంత్,అయన బృందానికి చెల్లించాల్సిన బిల్లు,వారికి అయ్యే ఖర్చు భరించడానికి కూడా అయన సిద్ధమైపోయారని వైసీపీ వర్గాల సమాచారం.పీవీపీ శ్రమ,చొరవ జగన్ ని ఇంప్రెస్ చేసిందట.పీవీపీ సేవలకు బదులుగా వచ్చే ఎన్నికల్లో కృష్ణా,గుంటూరు జిల్లాల్లో ఏదో ఓ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని పీవీపీ కోరుతున్నట్టు వైసీపీ వర్గాల టాక్ .జగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని కూడా వాళ్ళు చెప్తున్నారు.

SHARE