Saturday, May 8, 2021
HomeEntertainmentCinema Latest‘క్వీన్‌’ కాబోతున్న కాజల్‌. చివరి ఛాన్స్‌

‘క్వీన్‌’ కాబోతున్న కాజల్‌. చివరి ఛాన్స్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘క్వీన్‌’ చిత్రంను తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేసేందుకు త్యాగరాజన్‌ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. చాలా కాలంగా క్వీన్‌ రీమేక్‌కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎంతో మంది హీరోయిన్స్‌ను క్వీన్‌ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. నిత్యామీనన్‌, సమంత, నయనతార ఇలా ఎంతో మంది హీరోయిన్స్‌ పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు కాజల్‌ను క్వీన్‌ పాత్రకు ఎంపిక చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

‘క్వీన్‌’ చిత్రం అసలు వర్షన్‌లో కంగనా రనౌత్‌ నటించి మెప్పించింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా కథ నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా జయించింది అనేది సినిమా కథాంశం. కంగనా రనౌత్‌ ఆ పాత్రలో అద్బుతంగా నటించింది. ఆ స్థాయిలో సౌత్‌లో నటించగల సత్తా ఏ హీరోయిన్‌కు లేదనే టాక్‌ వినిపిస్తుంది. అయితే కాజల్‌ తన సీనియారిటీతో ఏమైనా మెప్పిస్తుందా అనేది చూడాలి. ఇటీవలే తెలుగులో ‘ఖైదీ నెం.150’ చిత్రంలో నటించి మంచి సక్సెస్‌ను అందుకున్న కాజల్‌ తెలుగు మరియు తమిళంలో క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అందుకే ముద్దుగుమ్మ కాజల్‌ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

spot_img

Most Popular