కమలం గూటికి ఆర్.కృష్ణయ్య..?

0
539
R Krishaiah is seeking to come to the party

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

R Krishaiah is seeking to come to the party

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధికారికంగా మరో షాక్ తగిలేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున తన క్యాడర్ను చేజార్చుకున్న నేపథ్యంలో తాజాగా మరో ఎమ్మెల్యే సైకిల్ దిగేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే అత్యంత ఆసక్తికరంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు కాకుండా మిత్రపక్షమైన బీజేపీలో సదరు ఎమ్మెల్యే చేరనున్నట్లు సమాచారం. పైగా అందుకోసం బీజేపీకి చెందిన ఏపీ నాయకురాలు లాబీయింగ్ నడపడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే…ఎల్బీ నగర్ టీడీపీ శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య. చర్చలు నిర్వహించింది బీజేపీ అగ్రనేత పురంధేశ్వరీ!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి బీజేపీ నేతలు వీలైనన్న ఎక్కువ మంది నేతల్ని పార్టీలోకి రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల్లో అసంతృప్తులు తటస్తులకు కాషాయ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించడాన్ని ఈ జాయినింగ్లకు వేదికగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యతో పురంధేశ్వరి భేటీ అయ్యారని సమాచారం. సుమారు గంటపాటు వీరి మధ్య జరిగిన చర్చల్లో ఆర్.కృష్ణయ్యను పార్టీలోకి రావాలని పురందీశ్వరీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి రావాలన్న ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని కృష్ణయ్య సమాధానం చెప్పినట్టు సమాచారం.

   
ఇదిలాఉండగా… వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పట్టు పెంచుకోవటమే లక్ష్యంగా పల్లె పల్లెకు బీజేపీ- ఇంటింటికీ మోడీ నినాదంతో ప్రణాళిక సిద్ధం చేసిన అమిత్ షా 3 రోజుల తెలంగాణ టూర్ కు శ్రీకారం చుట్టారు. ఓవైపు అమిత్ షా పర్యటిస్తున్న సమయంలో.. వీలైనంత మంది నేతల్ని కాషాయ పార్టీలో చేర్చుకోవాలని నేతలు శక్తివంచన లేకుండా ట్రై చేస్తున్నారు. కానీ ఎంతమంది సీనియర్లు బీజేపీ పంచన చేరతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Leave a Reply