కబాలి కి రూట్ క్లియర్…

0
643

r1

కబాలి ఫీవర్‌తో ఊగిపోతున్న రజినీ అభిమానులకు శుభవార్త …. కబాలి షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల అవ్వాలి. అయితే ఆ సినిమాను విడుదల చేయకుండా ఆపాలంటూ ఓ వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన శుక్ర ఫిలిమ్స్ భాగస్వామి ఆర్.మహాప్రభు. గతంలో రజినీ చేసిన లింగా సినిమాను పంపిణీ చేశారు. లింగా సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా వల్ల తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని, ఆ చిత్ర నిర్మాత వెంకటేశ్, రజినీకాంత్ నష్టపోయిన మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారని ప్రభు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇంకా తనకు రూ.89లక్షలు రావాల్సి ఉందని… ఆ బాకీ తీర్చాకే కబాలి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. గురువారం దీనిపై విచారణ చేసిన కోర్ట్ కబాలి విడుదలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో కబాలి కి రూట్ క్లియర్ అయ్యింది.

Leave a Reply