మూర్తి అన్న ఆవేదనలో అర్థం ఉంది..

Posted June 11, 2017 at 16:42

దర్శకరత్న దాసరి నారాయణ రావు సంతాప సభను టాలీవుడ్‌ ప్రముఖులు హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో నిర్వహించడం జరిగింది. సంతాప సభకు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఎంతో మంది వచ్చారు. ఈ సందర్బంగా దాసరి మృతి పట్ల అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దాసరికి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఇక ఎప్పుడు కూడా కాస్త ఆవేశంగా మాట్లాడే ఆర్‌ నారాయణ మూర్తి కాస్త ఆవేశ పూరితంగా మాట్లాడి ఆలోచింపజేశాడు.

గురువు గారు దాసరి నారాయణ రావు తనకు జీవితాన్ని ఇచ్చారు అని, పిలిచి అవకాశం ఇచ్చి, నాతో మంచి పాత్రలు చేయించారు అంటూ నారాయణమూర్తి చెప్పుకొచ్చాడు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం దాసరిని చిన్న చూపు చూసిందని, సినిమా రంగంలో విశేష కృషి చేసిన దాసరి నారాయణ రావుకు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేశాడు. నార్త్‌ వారు అర్హులు కాని, సౌత్‌ వారు ప్రతిష్టాత్మక అవార్డులకు అర్హులు కారా అంటూ ఎర్రన్న ప్రశ్నించాడు. దాసరికి వెంటనే కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును ప్రకటించాల్సిందే అంటూ డిమాండ్‌ చేశాడు. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాలు కూడా దాసరి కోసం కేంద్రం వద్ద మాట్లాడాల్సిందిగా ఆర్‌ నారాయణ మూర్తి కోరడం జరిగింది.

SHARE