Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్లో తెరకెక్కిన ‘రాబ్తా’ చిత్రం రామ్‌చరణ్, రాజమౌళిల కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ చిత్రానికి కాపీ అంటూ దుమారం చెలరేగిన విషయం తెల్సిందే. ‘మగధీర’ నిర్మాత అల్లు అరవింద్ ‘రాబ్తా’ చిత్రంపై కాపీ రైట్ చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అల్లు అరవింద్ కేసుకు ఏమాత్రం జడుసుకోకుండా ‘రాబ్తా’ టీం విడుదలకు సిద్దం చేయడం జరిగింది. ఇది ఏమాత్రం ఆ సినిమాకు కాపీ కాదని, ఒక మాట చెప్పాలి అంటే ‘మగధీర’ ఎన్ని సినిమాలకు కాపీనో తమ వద్ద సాక్షాధారాలు ఉన్నాయి అంటూ రివర్స్‌లో వచ్చారు.
‘రాబ్తా’ టీం రివర్స్ ఎటాక్‌తో దెబ్బకు షాక్ తిన్న అల్లు అరవింద్ సైలెంట్ అయ్యాడు. కేసు ఉపసంహరించుకోవడంతో రేపు ‘రాబ్తా’ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ‘మగధీర’ స్టోరీ లైన్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నారు కాని, సినిమా మొత్తం వేరుగా ఉందనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ కేసును ఉపసంహరించుకున్నారు అంటూ గీతాఆర్ట్స్ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి ‘రాబ్తా’ చిత్రంపై ‘మగధీర’ చిత్రం ఓడిపోయినట్లుగా పరిగణిస్తున్నారు యాంటీ మెగా ఫ్యాన్స్. రేపు విడుదల కాబోతున్న ‘రాబ్తా’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని బాలీవుడ్లో 300 కోట్ల వసూళ్లను సాధించడం ఖాయం అని అక్కడ విశ్లేషకులు, ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
