రాధ..తెలుగుబుల్లెట్ రివ్యూ

0
874
radha review in sarvanandh new movie

radha review in sarvanandh new movie
రాజుగారిని లుగుబుల్లెట్ రివ్యూ చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ చూసాక రాధ చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా అంతే .రాజు గారి కన్నా నా మొగుడే బాగున్నాడు అంటే అతిశయోక్తి అవుతుంది.లేదు రాజు గారి ముందు నా కళ్ళకి మొగుడు ఆగడం లేదంటే అబ్బో నేల విడిచి సాము చేస్తున్నారు అనుకోవచ్చు.అయినప్పటికీ రాజు రాజే,మొగుడు మొగుడే అనుకుని ఆ విచక్షణ వుపయోగించి మాత్రమే రాధ సినిమా చూడాలి.ఎందుకంటే తెలుగు సినిమా ఇలా ఉంటుంది అని ఓ అభిప్రాయం వుంది.ఆ బాక్స్ లో నుంచి చూసి కూడా రొటీన్ అయినా బాగుందే అనుకోగలిగిన వాళ్ళ కి రాధ నచ్చుతుంది .లేదా రొటీన్ అనిపిస్తోంది.

కథ..విశ్లేషణ .కధగా కన్నా వినోదానికి పెద్ద పీట వేస్తూ రాధ ప్రయాణం సాగుతుంది.పోలీస్ డ్రెస్ అంటే పిచ్చి మోజున్న కుర్రోడు ఆ డిపార్ట్ మెంట్ లో చేరడానికి చేసే ప్రయత్నం,చేరాక ఓ పిల్ల ప్రేమలో పడటం ఈ రెండు విషయాల్లో కావాల్సినంత వినోదం పండింది.ఫస్ట్ హాఫ్ చివరికి వచ్చేసరికి హీరో కి పెద్ద టార్గెట్ .సెకండ్ హాఫ్ లో దాన్ని రీచ్ కావడం.ఇలాంటి ఫార్ములా సినిమాలు తెలుగులో చాలా వచ్చినా,ఇలాగే వుంటాయని తెలిసినా దాన్ని ఎంజాయ్ చేసేట్టు కొత్త దర్శకుడు చంద్ర మోహన్ తీర్చిదిద్దిన వైనం బాగుంది.కధ లో కొత్తదనం ఉంటే తప్ప సినిమా ఒప్పుకోని శర్వానంద్ ఈ సారి మాత్రం వినోదాన్ని మాత్రమే నమ్ముకుని ఈ సినిమాకి ఓకే చెప్పాడు.అనుకున్నట్టే వినోదం పండించగలిగాడు. ఈ సినిమా కధకి ఇద్దరు హీరోయిన్స్ అవసరం లేకున్నా పెట్టారు.అది కధకి ప్లస్ కాదు మైనస్ కాదు.

ఇక భారీ చిత్రాలకే పరిమితమయ్యే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చిన్న చిత్రాలు తీయడం మొదలయ్యాక తీసిన సినిమాల్లో రాధ వుంది.ఆ బ్యానర్ కి తగ్గట్టే ప్రొడక్షన్ వాల్యూస్ వున్నాయి. అయితే బడ్జెట్ చిత్రాల్లో అయినా కొత్తదనానికి పెద్ద పీట వేస్తే బాగుండేది.పెద్ద సినిమాలకి కమర్షియల్ వేల్యూ గురించి ఆలోచించి అన్ని సార్లు వర్కౌట్ కావడం లేదనుకుని చిన్న సినిమాల్లోకి వచ్చాక కూడా అదే ఫార్ములా పట్టుకు వేలాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.మొత్తానికి రాధ కొందరికి నచ్చుతుంది.ఇంకొందరికి నచ్చదు.
తెలుగుబుల్లెట్ పంచ్ లైన్ …మన టేస్ట్ ని బట్టి రాధ అందం కనబడుతుంది
తెలుగుబుల్లెట్ రేటింగ్..2 .75 /5 .

Leave a Reply